https://oktelugu.com/

Venu Swamy : మద్యం ద్వారా నెలకు వేణు స్వామి ఎంత సంపాదిస్తాడో తెలుసా?..స్టార్ హీరోలకు కూడా ఇంత సంపాదన ఉండదు!

వేణు స్వామికి భక్తులు విదేశాల నుండి ఈయనకి ఖరీదైన మందు తెచ్చి ఇచ్చేవారని గర్వంగా చెప్పుకున్నాడు కూడా. అంతే కాదు ఈయనకి హైదరాబాద్ లో అనేక వైన్ షాపులు, బార్స్ ఉన్నాయి. వాటి ద్వారా ఈయన నెలకు లక్షల రూపాయిలు సంపాదిస్తూ ఉంటాడు.

Written By:
  • NARESH
  • , Updated On : August 14, 2024 / 10:14 PM IST

    Venu swamy

    Follow us on

    Venu Swamy : సోషల్ మీడియా లో ఉండే వారికి పరిచయం అక్కర్లేని పేరు వేణు స్వామి. సెలెబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలలో దోషాలను చెప్తూ నిత్యం వివాదాల్లో ఉండే ఈయన రీసెంట్ గా శోభిత – నాగ చైతన్య నిశ్చితార్థం విషయంలో కూడా ఇష్టమొచ్చినట్టు మాట్లాడి తీవ్రమైన వ్యతిరేకత ఎదురుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈయన మీద మహిళ కమీషన్ కేసు కూడా వేసింది. గతం లో ఈయన సమంత – నాగ చైతన్య విడిపోతారు అంటూ జాతకం చెప్పాడు. అది నిజం అయ్యేలోపు వేణు స్వామి టాప్ సెలెబ్రిటీల మీద తన విశ్వరూపం చూపించేసాడు. ప్రభాస్ కి ఇక జీవితం లో హిట్ రాదు అన్నాడు. ఇప్పుడు ఆయన సలార్, కల్కి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాడు. ఆది పినిశెట్టి తన భార్య తో విడిపోతాడు అన్నాడు, అది కూడా జరగలేదు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జగన్ సునామి సృష్టించి మరోసారి సీఎం అవుతాడు అన్నాడు, అది కూడా జరగలేదు.

    ఎన్నికల ఫలితాల తర్వాత జీవితంలో సెలెబ్రిటీలు, రాజకీయ నాయకుల జోలికి పోనని చెప్పిన ఈ పెద్ద మనిషి, నాగ చైతన్య నిశ్చితార్థం చేసుకోగానే తెల్ల బోర్డు పట్టుకొని వచేసాడు. వాళ్లిద్దరూ 2027 వ సంవత్సరం లో విడిపోతారు అంటూ నోటికి వచ్చింది చెప్పి నేడు తీవ్రమైన పరిస్థితులను ఎదురుకుంటున్నాడు. ఇదంతా పక్కన పెడితే వేణు స్వామి మందు కొడుతాడు అనే విషయం మీకెవరికైనా తెలుసా..?, అతని ఇంటర్వ్యూస్ చూసే ఎవరికైనా ఈ విషయం తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలియకపోతే యూట్యూబ్ లో చూడండి. ఈయన భక్తులు విదేశాల నుండి ఈయనకి ఖరీదైన మందు తెచ్చి ఇచ్చేవారని గర్వంగా చెప్పుకున్నాడు కూడా. అంతే కాదు ఈయనకి హైదరాబాద్ లో అనేక వైన్ షాపులు, బార్స్ ఉన్నాయి. వాటి ద్వారా ఈయన నెలకు లక్షల రూపాయిలు సంపాదిస్తూ ఉంటాడు. అలా ఈయన కేవలం మద్యం ద్వారా ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయిలు సంపాదించాడని తెలుస్తుంది. వేణు స్వామి సామాన్యులకు కూడా జాతకాలు చెప్తాడు. అందుకోసం ఆయన ఒక్కొక్కరి దగ్గర 10 వేల రూపాయిలను ఫీజు రూపం లో తీసుకుంటాడు.

    అలా ఈయన కేవలం జాతకాల ద్వారా ఎంత డబ్బులు సంపాదిస్తాడో ఊహించుకోండి. ఇతను ఒక దొంగ స్వామిజీ అని బాబు గోగినేని వంటి వారు లైవ్ డిబేట్స్ లో కూర్చొని నిరూపించారు. ఇతని చెప్పిన జాతకాలలో నూటికి 90 శాతం ఫెయిల్ అయ్యినవే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇతన్ని నమ్మే జనాలు ఉన్నారు. సామాన్యుల దాకా కూడా అవసరం లేదు, సినీ సెలెబ్రిటీలు రష్మిక, నిధి అగర్వాల్, డింపుల్ హయాతి, అషు రెడ్డి ఇలా ఎంతో మంది ఈయన దగ్గర జాతకాలు చెప్పించుకున్నారు. ఆయన చెప్పినట్టు చేసారు కూడా. అలా వేణు స్వామి వ్యాపారం అమాయకులైన జనాల కారణంగా గడిచిపోతూ ఉంది. భవిష్యత్తులో ఈయనకి బ్రేక్ వేసేవారు ఎవరో చూడాలి.