Venu Swamy
Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి(Venu Swamy) ఏమి మారలేదు..సెలబ్రిటీస్ జీవితాల గురించి ఇష్టమొచ్చినట్టు అశుభాలు మాట్లాడుతూ అనేక వివాదాల్లో చిక్కుకున్నాడు ఈయన. ఎవరైనా సెలబ్రిటీలు కొత్తగా పెళ్లి చేసుకుంటే, వాళ్ళు విడిపోతారు అంటూ నోటికిచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తుంటాడు. రీసెంట్ గానే నాగ చైతన్య(Naga Chaitanya), శోభిత(Sobhita Dhulipala) 2027 వ సంవత్సరం లో విడిపోతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. శుభమా అని వాళ్ళు నిశ్చితార్థం చేసుకొని వస్తే, ఆశీర్వదించాల్సింది పోయి అపశకునపు మాటలు మాట్లాడుతావా అని వేణు స్వామి పై సభ్యసమాజం ఫైర్ అయ్యింది. సినీ జర్నలిస్టులు ఇతని పై చర్యలు తీసుకోవాలని మహిళా కమీషన్ కి వెళ్తే, కమీషన్ కూడా ఇతనికి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇక నుండి ఇలాంటి జాతకాలు చెప్పను అంటూ మహిళా కమీషన్ వద్ద క్షమాపణలు చెప్పి ప్రాధేయపడ్డాడు. సరేలే ఇకనైనా చక్కగా ఉంటాడు అని అంతా ఆశించారు.
కానీ వెంటనే ఆయన తన బుద్ధి మొత్తాన్ని బయటపెట్టేసాడు. సోషల్ మీడియా లో నేరుగా అయితే చెప్పలేదు కానీ, ఒక ఫోన్ కాల్ సంభాషణలో ఆయన ముగ్గురు టాప్ సెలబ్రిటీస్ గురించి మాట్లాడిన మాటలను, ఒక ప్రముఖ జర్నలిస్ట్ సోషల్ మీడియా లో విడుదల చేసాడు. ఈ వీడియో లో వేణు స్వామి మాటలను విన్న ఎవరికైనా రక్తం మరిగిపోతాది. ఇంతకు ఆయన ఏమి మాట్లాడాడో చూద్దాం. ‘నేను గతంలో ముగ్గురు టాప్ స్టార్స్ చనిపోతారని చెప్పాను. ఆ సమయంలో నేను చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి, నన్ను బాగా విమర్శించారు కూడా. చనిపోయే వారిలో ఒక హీరోయిన్, ఒక హీరో ఉంటారని చెప్పాను. హీరోలలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), లేదా ప్రభాస్(Rebel Star Prabhas) చనిపొవఛు’ అని ఫోన్ కాల్ సంభాషణలో చెప్తాడు. అప్పుడు ఆ సంభాషణలో ఉన్న అమ్మాయి ‘సమంత(Samantha Ruth Prabhu) అఘాయిత్యం చేసుకుంటుందా’ అని అడుగుతుంది.
దానికి వేణు స్వామి సమాధానం చెప్తూ ‘ఎవరైనా చేసుకోవచ్చు. నాలెక్క ప్రకారం విజయ్ ఎవరకొండ చేసుకుంటాడు. ఈ విషయాలు బయటకి రావడానికి చాలా సమయం పడుతుంది. మీడియా లో ఎవరికీ కూడా నేను ఈ విషయాన్ని చెప్పలేదు. రాజా సాబ్ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది కదా, ఎందుకని అనుకుంటున్నారు’ అని వేణు స్వామి అడగగా, దానికి ఆమె సమాధానం చెప్తూ ‘సాధారణంగా సినిమాలు వాయిదా పడుతూ ఉంటాయి కదా, అది సహజమే..మీరెందుకు నొక్కి మరీ చెప్తున్నారు, సీరియస్ గాయాలు ఏమైనా అయ్యాయా?’ అని అంటుంది. అప్పుడు వేణు స్వామి సమాధానం చెప్తూ ‘ప్రభాస్ కి ఒక్క గాయం కాదు, శరీరమంతా గాయాలే’ అని అంటాడు. వేణు స్వామి మాట్లాడిన ఈ మాటలు ప్రభాస్, సమంత అభిమానులకు పిచ్చి కోపం వచ్చేలా చేస్తుంది. వేణు స్వామి మాట్లాడిన ఈ ఆడియో ని విని, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియచేయండి.
మరో వివాదాస్పద వ్యాఖ్యలు వేణు స్వామి
ప్రభాస్ …విజయ్ దేవరకొండ సమంత… వీళ్ళు సూసైడ్ చేసుకోబోతున్నారు #Prabhas #VijayDeverakonda#Samanthapic.twitter.com/6sWan1o7Bn
— Milagro Movies (@MilagroMovies) March 21, 2025