Veera Simha Reddy: వీరసింహారెడ్డికి తలనొప్పిగా మారిన ‘జై బాలయ్య’… వచ్చిన హైప్ మొత్తం పోయింది!

Veera Simha Reddy: కొత్త వింత పాత రోత. ఒకసారి సక్సెస్ అయిన ఫార్ములా పదే పదే వాడితే బెడిసికొట్టొచ్చు. వీరసింహారెడ్డికి ‘జై బాలయ్య’ అలానే అయ్యింది అంటున్నారు. వీరసింహారెడ్డి ఫస్ట్ సింగిల్ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దానికి ప్రధాన కారణం… లిరిక్స్ లో ‘జై బాలయ్య’ అనే పదం వాడడమే. నిజానికి బాలకృష్ణ డై హార్డ్ ఫ్యాన్స్ స్లోగన్ ‘జై బాలయ్య’. అది బాలయ్యను గొప్పగా ఎలివేట్ చేస్తుందని భావిస్తారు. జై బాలయ్య టైటిల్ తో […]

Written By: Shiva, Updated On : November 26, 2022 2:21 pm
Follow us on

Veera Simha Reddy: కొత్త వింత పాత రోత. ఒకసారి సక్సెస్ అయిన ఫార్ములా పదే పదే వాడితే బెడిసికొట్టొచ్చు. వీరసింహారెడ్డికి ‘జై బాలయ్య’ అలానే అయ్యింది అంటున్నారు. వీరసింహారెడ్డి ఫస్ట్ సింగిల్ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దానికి ప్రధాన కారణం… లిరిక్స్ లో ‘జై బాలయ్య’ అనే పదం వాడడమే. నిజానికి బాలకృష్ణ డై హార్డ్ ఫ్యాన్స్ స్లోగన్ ‘జై బాలయ్య’. అది బాలయ్యను గొప్పగా ఎలివేట్ చేస్తుందని భావిస్తారు. జై బాలయ్య టైటిల్ తో ఆయన హీరోగా మూవీ చేయాలని ప్రయత్నాలు జరిగినా కార్యరూపం దాల్చలేదు. భవిష్యత్తులో ఇది ఖచ్చితంగా సాకారం కానుంది.

balakrishna

దర్శకుడు అనిల్ రావిపూడితో బాలకృష్ణ నెక్స్ట్ చేస్తున్న ప్రాజెక్టు టైటిల్ జై బాలయ్య కావచ్చు అంటున్నారు . ఇక అఖండ మూవీలో ‘జై బాలయ్య’ సాంగ్ పెట్టారు. ఆ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అఖండలో వన్ అండ్ ఓన్లీ కమర్షియల్ సాంగ్ అది. ప్రగ్యాతో వేసిన బాలయ్య స్టెప్స్ అలరించాయి. చొక్కాలు మారుస్తూ వేసే బాలయ్య స్టెప్ విపరీతమైన ప్రాచుర్యం పొందింది.

ఈ నేపథ్యంలో వీరసింహారెడ్డి మూవీ నుండి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఈ సాంగ్ లో లిరిక్స్ లో జై బాలయ్య నినాదం వాడారు. ఐతే ఈసారి అది ప్లస్ కాకపోగా మైనస్ అయ్యిందంటున్నారు. హీరో పేరు వీరసింహారెడ్డి అయినప్పుడు జై బాలయ్య ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. లాజిక్ పాడు లేకుండా జై బాలయ్య ను వాడేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దానికి తోడు థమన్ ట్యూన్.. ఒసేయ్ రాములమ్మ టైటిల్ సాంగ్ లా ఉంది అంటున్నారు. దాని తాలూకు ఎడిటింగ్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.

balakrishna

మరోవైపు ఈ సాంగ్ రాసిన రామజోగయ్య శాస్త్రిని కొందరు టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో ఆయన హర్ట్ అయ్యేలా కామెంట్స్ పెట్టారు. రామజోగయ్య శాస్త్రి సదరు నెగిటివ్ ట్వీట్స్ కి స్పందించడం జరిగింది. నన్ను గౌరవంగా చూడగలిగినవారే నాతో ప్రయాణం చేయండి. లేదంటే ఇటువైపు రావద్దు. ప్రతి పాట నేను ప్రాణం పెట్టి రాస్తాను, అని ట్వీట్ చేశారు. బాలయ్య లుక్, ప్రోమోలు వీరసింహారెడ్డి చిత్రానికి మంచి హైప్ తెచ్చాయి. దాన్నంతటినీ జై బాలయ్య నినాదం పాడు చేసింది. జై బాలయ్య సాంగ్ విజువల్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ లిరిక్స్, ట్యూన్ దెబ్బతీశాయి.

Tags