Veera Simha Reddy Collections: ఒకప్పుడు బాలయ్య బాబు సినిమా అంటేనే జనాలు చూడడానికి కాస్త భయపడేవాళ్లు..సమరసింహా రెడ్డి మరియు నరసింహ నాయుడు సినిమాల తర్వాత బాలయ్య చేసిన సినిమాలు బాగా ట్రోల్ అయ్యాయి..బాలయ్య కోసం పుట్టాడు అని అనిపించేలా వచ్చిన బోయపాటి శ్రీను వల్ల మూడు భారీ హిట్స్ పడ్డాయి కానీ, మధ్యలో వచ్చిన సినిమాలన్నీ దారుణంగా ఫ్లాప్ అయ్యాయి..ఒకానొక్క దశలో బాలయ్య బాబు కి ఫుల్ రన్ లో సింగల్ డిజిట్ షేర్స్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి.

‘అఖండ’ కి ముందు ఆయన చేసిన రూలర్ సినిమాకి కనీసం పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదు..ఆ సినిమా రన్ ని చూసి నందమూరి అభిమానులు ఇక బాలయ్య బాబు సినిమాలు ఆపేయడం మంచిది అంటూ సోషల్ మీడియా లో పోస్టులు పెట్టేవాళ్ళు..కానీ ‘అఖండ’ చిత్రం బాలయ్య తలరాతనే మార్చేసింది..ఇక ఆ వెంటనే ఆహా మీడియా లో వచ్చిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ టాక్ షో బాలయ్య క్రేజ్ మరింత పెరిగింది.
అలా బాలయ్య కెరీర్ లో పీక్ చూస్తున్న సమయం లో సంక్రాంతి కానుకగా ‘వీర సింహా రెడ్డి’ చిత్రం విడుదల అయ్యింది..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం యావరేజి టాక్ తెచుకున్నప్పటికీ కూడా మంచి వసూళ్లనే రాబట్టింది..’వాల్తేరు వీరయ్య’ చిత్రం తో పోలిస్తే తక్కువ వసూళ్లే కానీ, బాలయ్య పరిధిని దృష్టిలో పెట్టుకొని చూస్తే మంచి వసూళ్లే అని చెప్పాలి.

బాలయ్య గత చిత్రం ‘అఖండ’ బాక్స్ ఆఫీస్ వద్ద 70 కోట్ల రూపాయిల షేర్ ని క్లోసింగ్ లో వసూలు చేస్తే ‘వీర సింహా రెడ్డి’ చిత్రం కేవలం వారం రోజుల్లోనే 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసి సంచలనం సృష్టించింది..టాక్ యావరేజి గా వచ్చినప్పటికీ బాలయ్య మొదటి వారం లోనే ఈ రేంజ్ వసూళ్లను రాబట్టాడు అంటే కచ్చితంగా ఆయన రేంజ్ మునుపటి సినిమాలతో పోలిస్తే బాగా పెరిగింది అనే చెప్పాలి.