Veera Simha Reddy Closing Collections: ఈ సంక్రాంతి కి భారీ అంచనాల నడుమ విడుదలైన పెద్ద సినిమా ‘వీర సింహా రెడ్డి’..నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత తీసిన సినిమా కావడం తో ఈ మూవీ పై అంచనాలు భారీ రేంజ్ లో ఉండేవి..అందుకే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 75 కోట్ల రూపాయలకు జరిగింది..ఇది బాలయ్య మార్కెట్ రేంజ్ కి చాలా ఎక్కువే..అయితే ఓపెనింగ్స్ అదరగొట్టిన ఈ చిత్రం లాంగ్ రన్ లో మాత్రం నందమూరి అభిమానులను ఆశించిన స్థాయిలో సంతృప్తి పరచలేదు..సంక్రాంతి సెలవుల్లో మంచి వసూళ్లనే రాబట్టినప్పటికీ ఆ తర్వాత మాత్రం పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయింది..చాలా ప్రాంతాలలో 12 వ రోజు నుండి షేర్స్ రాకపొయ్యేసరికి కమిషన్ బేసిస్ మీద ఈ చిత్రాన్ని రన్ చేస్తున్నారు..ఇప్పుడు దాదాపుగా అన్ని ప్రాంతాలలో బిజినెస్ క్లోజ్ అయిపోయింది..ప్రాంతాలవారీగా ఇప్పటి వరకు ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో చూద్దాము.

ప్రాంతం: వసూళ్లు(షేర్):
నైజాం 16.86 కోట్లు
సీడెడ్ 16.28 కోట్లు
ఉత్తరాంధ్ర 8.51 కోట్లు
ఈస్ట్ 5.53 కోట్లు
వెస్ట్ 4.15 కోట్లు
నెల్లూరు 2.95 కోట్లు
గుంటూరు 6.32 కోట్లు
కృష్ణ 4.67 కోట్లు
మొత్తం 65.27 కోట్లు
ఓవర్సీస్ 5.70 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.76 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 75.73 కోట్లు

బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సూపర్ హిట్ స్టేటస్ కి అయితే ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా చేరుకుంది..కానీ వచ్చిన ఓపెనింగ్స్ తో పోల్చి చూస్తే మాత్రం నిరాశే అని చెప్పొచ్చు..కానీ నందమూరి అభిమానులు మరీ అంత నిరాశకి గురి అవ్వాల్సిన అవసరం లేదు..ఈ చిత్రానికి ‘అఖండ’ రేంజ్ టాక్ అయితే రాలేదు..డివైడ్ టాక్ మీదనే ఇంత వసూళ్లు వచ్చాయి..ఒకప్పుడు బాలయ్య మార్కెట్ ఇంత ఉండేది కాదు..30 కోట్ల రూపాయిల లోపే ఆయన సినిమాలు క్లోజ్ అయ్యేవి..అలాంటిది 75 కోట్ల రూపాయిల వరకు లాగాడు అంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి..బాలయ్య తదుపరి చెయ్యబొయ్యే సినిమాలు కూడా ప్రామిసింగ్ గా ఉన్నాయి..ఒక డీసెంట్ సినిమా తీస్తే వంద కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టడం పెద్ద కష్టమేమి కాదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.