Veera Simha Reddy Collections: అఖండ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై యావరేజి టాక్ ని తెచ్చుకొని యావరేజి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ముందుకెళుతోంది.. ఫుల్ రన్ సంగతి కాసేపు పక్కన పెడితే, ఈ చిత్రానికి వచ్చిన ఓపెనింగ్స్ ని మాత్రం అంత తేలికగా ఇప్పట్లో ఎవ్వరూ మర్చిపోలేరు..ఆ స్థాయిలో ఈ సినిమా ఓపెనింగ్స్ వచ్చాయి.

అఖండకి ముందు 30 కోట్ల రూపాయిల మార్కెట్ కూడా లేని బాలయ్య మొదటి రోజు 30 కోట్ల రూపాయిల ఓపెనింగ్ కొట్టే రేంజ్ కి ఎదుగుతాడని అభిమానులే కాదు, బహుశా బాలయ్య బాబు కూడా ఊహించి ఉండడు.. ఓపెనింగ్ డే తర్వాత కూడా ఈ సినిమా డీసెంట్ స్థాయి వసూళ్లనే రాబట్టింది.. ఇప్పటి వరకు విడుదలైన 5 రోజులకు గాను ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ప్రాంతాలవారీగా చూద్దాం..
ప్రాంతం: వసూళ్లు(షేర్):
నైజాం 13.67 కోట్లు
సీడెడ్ 13.55 కోట్లు
ఉత్తరాంధ్ర 5.16 కోట్లు
ఈస్ట్ 3.96 కోట్లు
వెస్ట్ 3.20 కోట్లు
నెల్లూరు 2.18 కోట్లు
గుంటూరు 5.30 కోట్లు
కృష్ణ 3.51 కోట్లు
———————
మొత్తం 58.88 కోట్లు
ఓవర్సీస్ 5.30కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.05 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 59.90 కోట్లు

బాలకృష్ణ కెరీర్ లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవబోతోంది.. అఖండ చిత్రం ఫుల్ రన్ లో దాదాపుగా 65 కోట్ల రూపాయలు సాధించింది.. ఇప్పుడు ‘వీరసింహారెడ్డి’ చిత్రం ఆ వసూళ్లను కేవలం మొదటి వారంలోనే రాబడుతుండడం విశేషం.. యావరేజి టాక్ కి ఇంత వసూళ్లు వచ్చాయంటే, ఈ సినిమాకి అఖండ రేంజ్ టాక్ వచ్చి ఉంటే కచ్చితంగా బాలయ్య వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టేవాడని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు.. అంత వరస్ట్ పీరియడ్ అనుభవించిన తర్వాత ఏ హీరో కూడా తన మార్కెట్ ని ఈ రేంజ్ లో నిలుపుకోలేదు అని అంటున్నారు.. బాలయ్య తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడితో తీస్తున్నాడు.. ఈ సినిమా తో ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో వేచిచూడాల్సిందే..