Homeఎంటర్టైన్మెంట్Ved Box Office: నాగ చైతన్య రీమేక్ సినిమాకి బాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం

Ved Box Office: నాగ చైతన్య రీమేక్ సినిమాకి బాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం

Ved Box Office: టాలీవుడ్ లవ్ స్టోరీస్ లో క్లాసిక్స్ గా నిల్చిన అతి తక్కువ సినిమాలలో ఒకటి ‘మజిలీ’..నాగ చైతన్య – సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..నాగ చైతన్య – సమంత పెళ్లి చేసుకున్న తర్వాత చేసిన ఏకైక సినిమా అదే..శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు..ఆరోజుల్లోనే ఈ సినిమా దాదాపుగా 40 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లను సాధించింది.

Ved Box Office
Ved Box Office

 

నాగ చైతన్య కెరీర్ లో ఇప్పటికీ ఈ చిత్రం టాప్ 2 గ్రాసర్ గా నిలిచిపోయింది..అంతటి సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని హిందీ లో ‘వేద్’ అనే పేరు తో రీమేక్ చేసారు..ఈ రీమేక్ లో కూడా నిజ జీవితం లో భార్య భర్తలైన రితేష్ దేశ్ ముఖ్ మరియు జెనీలియా హీరో హీరోయిన్లు గా నటించారు..మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి డైరెక్టర్ కూడా రితేష్ దేశ్ ముఖ్.

మరాఠి భాషలో తెరకెక్కించిన ఈ సినిమాని డిసెంబర్ 30 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేసారు..రెస్పాన్స్ అదిరిపోయింది..కేవలం వారం రోజుల్లోనే ఈ చిత్రం 45 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది..సోలో హీరో గా రితేష్ సూపర్ హిట్ ని అందుకొని చాలా కాలమే అయ్యింది..ఇప్పుడు ఈ ‘వేద్’ చిత్రం ద్వారా ఆ బాకీ తీరిపోయింది..ఇప్పటికీ కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ ని రాబడుతూ ముందుకు దూసుకెళ్తుంది.

Ved Box Office
Ved Box Office

బాలీవుడ్ ట్రేడ్ వర్గాల లెక్క ప్రకారం ఈ సినిమా ఫుల్ రన్ లో 110 కోట్ల రూపాయలకు తక్కువ రాబట్టదని అంటున్నారు..కేవలం 15 కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రేంజ్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తుంది రితేష్ దేశ్ ముఖ్ కూడా అంచనా వెయ్యలేకపోయాడట..మరి ఈ సినిమా ఫుల్ రన్ ఎక్కడిదాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version