Vastu Tips: ఇటీవల కాలంలో ఇల్లు ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రతి వారు తిండి, గుడ్డ, గూడుకు ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్నారు. ఉండటానికి నీడ తప్పనిసరిగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో ఏదో ఒకటి ఇల్లు ఉండాలని భావిస్తున్నారు. గుడిసె, పెంకుటిల్లు, దాబా ఏదైనా నిర్మించుకోవాలని తలపిస్తున్నారు. ఇందుకోసమే శ్రమిస్తున్నారు. సొంతంగా కట్టుకునే ఇల్లైనా అపార్ట్ మెంటైనా మనకు రక్షణగా నిలిచేదే ఇల్లు. దీనికి గాను ప్రతి ఒక్కరు కలలు కంటున్నారు. వాస్తు పద్ధతుల ప్రకారం ఇల్లు నిర్మించుకుని మంచి జరగాలని కోరుకోవడంలో తప్పులేదు.

పక్కా వాస్తు ప్రకారమే నిర్మించుకోవాలని చూస్తున్నారు. వాస్తు సరిగా లేకపోతే ఇబ్బందులు వస్తాయి. రకరకాల సమస్యలకు కారణమవుతుంది. దీంతోనే వాస్తు ప్రకారం నిర్మించుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. వాస్తు లోపం ఉంటే మానసిక, శారీరక సమస్యలు ఏర్పడతాయి. వాస్తు పద్ధతులు పాటించకపోతే అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. వాస్తు చిట్కాలు పాటించకపోతే వచ్చే ముప్పును ముందుగానే గుర్తించి ఆ తప్పులు లేకుండా చేసుకోవాలి. జీవితం ప్రకాశవంతంగా మారేందుకు వాస్తును కచ్చితంగా అమలు చేయాల్సిందే.
వాస్తు పద్ధతిగా ఉంటే అదృష్టం కూడా దానంతట అదే వస్తుంది. ఉత్తర దిశ కుబేర స్థానం కావడంతో ఆ దిశగా ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే ముఖ్యమైన వస్తువులను ఉత్తర దిశలో ఉంచుకోవడమే శ్రేయస్కరం. ఉత్తర ద్వారం ప్రధానమైనది. ఇంటి శ్రేయస్సు కోసం ఐశ్వర్యం సిద్ధించాలంటే కుబేరుడి విగ్రహం ఉంచుకోవాలి. ఉత్తర దిక్కులో మంచి ప్రయోజనాలు కలగాలంటే ఇంకా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఉత్తర దిశలో వంట గది ఉండటం శుభప్రదం. దీంతో ఇంట్లో డబ్బు, ధాన్యం నిల్వలు పెరుగుతాయి.

వాస్తు ప్రకారం ఇల్లు లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. వాస్తు పండితుల సలహాల ప్రకారం ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నించాలి. వాస్తు రీత్యా మార్పులు చేసుకుని ఇల్లు చక్కబెట్టుకోవాలి. సనాతన కాలం నుంచి వాస్తు పద్ధతులు పాటిస్తూనే ఉన్నారు. మనం కట్టుకునే ఇల్లు పక్కా వాస్తు పద్ధతులతో ఉంటే మనకు అన్ని రకాల ప్రయోజనాలు దక్కుతాయి. దీనికి మనం మంచి వాస్తు నియమాలు పాటించడమే. నిష్ణాతులైన వారిచే వాస్తు చిక్కాలు పాటించి ఇల్లు నిర్మించుకుని కష్టాలు లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.