Upasana Konidela:రామ్ చరణ్ భార్య ఉపాసన బామ్మను కోల్పోయారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఉపాసన తెలియజేశారు. గ్రాండ్ మదర్ మరణంపై స్పందిస్తూ ఉపాసన సోషల్ మీడియా పోస్ట్ చేశారు. బామ్మా మీరు ప్రేమ, గౌరవం, కృతజ్ఞత తో కూడిన ఉన్నతమైన జీవితాన్ని గడిపారు. మీ జీవితం నాకు స్ఫూర్తి దాయకం. మీరు నన్ను పెంచి పెద్ద చేశారు. మీ జ్ఞాపకాలు ఎన్నటికీ నన్ను వెంటాడతాయి. మీరు నాపై చూపించిన ప్రేమాభిమానాలు నా పిల్లలకు కూడా నేను నేర్పుతాను… అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఉపాసన గ్రాండ్ మదర్ మరణవార్త తెలుసుకున్న అభిమానులు, పరిశ్రమ వర్గాలు సంతాపం తెలియజేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఉపాసన తాతగారు మరణించారు. ఉపాసన దోమకొండ సంస్థానానికి చెందిన వారసురాలు. వారి కుటుంబంలో ఎవరు మరణించినా దోమకొండ సంస్థానం వెళ్లి అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తారు. తెలంగాణా రాష్ట్రంలో ఉన్న సంస్థానాలలో దోమకొండ ఒకటి. ఉపాసన పూర్వీకుల సంస్థానానికి చెందిన కోటలు, వాటి ఆనవాళ్లు అక్కడ ఉన్నాయి.
కాగా ఉపాసన పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత గర్భం దాల్చారు. ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్. ఆ విషయాన్ని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 2012లో ఉపాసన-రామ్ చరణ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏళ్ళు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడంతో ఉపాసనను ఉద్దేశిస్తూ అనేక రూమర్స్ తెరపైకి వచ్చాయి. వాటన్నింటికీ తల్లి కావడం ద్వారా ఉపాసన సమాధానం చెప్పారు. రామ్ చరణ్-ఉపాసనలపై ప్రచారమైన కథనాలు మనసును చాలా బాధపెట్టాయని చిరంజీవి స్వయంగా తెలిపారు.

ఈ ఏడాది మెగా వారసుడు దిగనున్నాడు. ఇది మెగా అభిమానులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న పండగ. సినిమాల్లో వారసత్వం సాధారణం. ఈ క్రమంలో చిరంజీవి, రామ్ చరణ్ లెగసీని ముందుకు తీసుకెళ్లే వారసుడు పుట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. చరణ్ అక్క సుస్మిత సైతం అబ్బాయి పుడితే బాగుండన్న అభిప్రాయం వెల్లడించారు. ఇప్పటికే నలుగురు అమ్మాయిలం ఉన్నాం… ఒక అబ్బాయి మా కుటుంబంలోకి వస్తే ఆ కోరిక కూడా తీరుతుందని అన్నారు