Pathan Collection First Week: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో డీలాపడిన బాలీవుడ్ ఇండస్ట్రీ ఇక కోలుకుంటామా లేదా అనే డైలమాలో పడినప్పుడు వచ్చిన చిత్రం ‘పఠాన్’..బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ సుమారుగా నాలుగు సంవత్సరాల పాటు సుదీర్ఘ విరామం తీసుకొని చేసిన ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని రేంజ్ అద్భుతాలను సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది..ఈ సినిమాకి ముందు షారుఖ్ ఖాన్ కూడా వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్నాడు..ఆయన పని ఇక అయిపోయింది అంటూ ప్రముఖ మీడియా చానెల్స్ కూడా ప్రచారం చేసాయి.

కానీ వాళ్ళందరికీ పఠాన్ చిత్రం ద్వారా ఒకే ఒక్క దెబ్బ తో సమాధానం చెప్పాడు..ఇప్పుడు బాలీవుడ్ హిస్టరీ లోనే మొట్టమొదటి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ సాధించిన బాలీవుడ్ హీరో గా షారుఖ్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు..ఇది ఇలా ఉండగా ఈ సినిమా విడుదలై ఇప్పటికే వారం రోజులైంది..ఈ వారం రోజులకు ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం చూడబోతున్నాము.
మొదటి రోజు ఈ చిత్రానికి 55 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి..ఇది బాలీవుడ్ హిస్టరీ లో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు గా చెప్పుకోవచ్చు..రెండవ రోజు అయితే మొదటి రోజు కంటే ఎక్కువగా 68 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది..ఒక స్టార్ హీరో సినిమాకి మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ వసూళ్లు రావడం ఇదే తొలిసారి..అలా బాక్స్ ఆఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఈ సినిమాకి మూడవ రోజు 38 కోట్ల రూపాయిలు, నాల్గవ రోజు 51 కోట్ల రూపాయలు..అయిదవ రోజు 58 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టి నాలుగు రోజులు 50 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టిన ఏకైక సినిమాగా సరికొత్త చిత్ర సృష్టించింది.

ఇంత పెద్ద వీకెండ్ తర్వాత సోమవారం నుండి కలెక్షన్స్ బాగా డ్రాప్ అవుతాయి అనుకున్నారు..కానీ సోమవారం నాడు పాతిక కోట్ల రూపాయిలు మరియు మంగళవారం నాడు 22 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టి వారం రోజులకు గాను ఇండియా లో 325 కోట్లు వసూలు చేసిన చిత్రం గా నిలిచింది..గ్రాస్ పరంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 634 కోట్ల రూపాయిలు వసూలు చేసినట్టు తెలుస్తుంది.
