Varasudu Box Office Collection: ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ చిత్రం ఓపెనింగ్స్ అభిమానులకు ఒక రేంజ్ కిక్ ని ఇచ్చింది..బాలయ్య కెరీర్ లో మళ్ళీ ఇలాంటి ఓపెనింగ్స్ ని చూస్తామో లేదో తెలియదు కానీ రెండు దశాబ్దాల తర్వాత బాలయ్య చిరంజీవి తో సరిసమానమైన ఓపెనింగ్స్ ని దక్కించుకున్నాడు..అందుకు నందమూరి అభిమానులు చాలా సంతోషపడ్డారు.

అయితే ఈ సినిమాకి సంక్రాంతి పండుగ గనుక లేకపోయి ఉంటే క్లోసింగ్ కలెక్షన్స్ కనీసం 50 కోట్లు కూడా వచ్చేవి కాదని సంక్రాంతి సెలవుల తర్వాత ఆ సినిమా రాబట్టిన వసూళ్లను చూస్తే అర్థం ఎవరికైనా అర్థం అవుతుంది..వీకెండ్స్ లో కూడా ఈ సినిమాకి వస్తున్న వసూళ్లు అంతంత మాత్రమే..ఇక నిన్న రిపబ్లిక్ డే నాడు ఈ చిత్రానికి ఒక్క చోట కూడా హౌస్ ఫుల్ బోర్డ్స్ పడకపోవడం బాధాకరం..నేషనల్ హాలిడే ప్రతీ ఒక్క సినిమాకి బాగా కలిసొచ్చింది..ఒక్క బాలయ్య కి తప్ప.
ఈ సినిమా రన్ ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే సినిమాలో మితిమీరిన వయోలెన్స్ ఉంటే ఓపెనింగ్స్ వరకు బాగానే రావొచ్చు కానీ, ఫుల్ రన్ మాత్రం ఉండదు అని..గతం లో కూడా ఇలాంటి సినిమాల రన్ ఇంతే ఉండేవి..అదంతా పక్కన పెడితే నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘వీర సింహా రెడ్డి’ చిత్రం కంటే తమిళ హీరో విజయ్ నటించిన ‘వారసుడు’ సినిమాకి మంచి వసూళ్లు వచ్చాయట..ఇది అందరినీ షాక్ కి గురి చేసింది.

సాధారణంగానే బాలయ్య సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపరు..ఇక ఆ రేంజ్ రక్త పాతం తో నిండిపోయిన సన్నివేశాలున్న సినిమాకి ఎలా కదులుతారు..నిన్నటితోనే ఈ చిత్రం థియేట్రికల్ రన్ ఆగిపోయినట్టే అనుకోవాలి..కానీ మొత్తం మీద ఈ సినిమాకి అఖండ కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి..అఖండ చిత్రానికి 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే ‘వీర సింహా రెడ్డి’చిత్రానికి 74 కోట్ల రూపాయిలు వచ్చాయి.