Waltair Veerayya Collection: సంక్రాంతి పండుగ నాడు ప్రారంభమైన ‘వాల్తేరు వీరయ్య’ ప్రభంజనం నేటికీ కొనసాగుతూనే ఉంది..ఏముందిలే మామూలు యావరేజి సినిమానే కదా, పండుగ తర్వాత కలెక్షన్స్ బాగా డ్రాప్ అవుతాయని ట్రేడ్ పండితులు సైతం అంచనా వేశారు..కానీ అక్కడ ఉన్నది మెగాస్టార్ చిరంజీవి..వాళ్ళు అంచనా వేసినట్టు ఆయన స్టార్ స్టేటస్ ఎలా ఉంటుంది..అందుకే పండుగ తర్వాత కూడా ఈ చిత్రానికి వర్కింగ్ డేస్ లో సాలిడ్ కలెక్షన్స్ వచ్చాయి..ఇది మాత్రం నిజం గా అభిమానులు కూడా ఊహించలేకపోయారు.

అనకాపల్లి నుండి అమెరికా వరకు మెగాస్టార్ కి ఉన్న బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఆకలి ని మొత్తం తీర్చేసింది ఈ చిత్రం..ముఖ్యంగా ఉత్తరాంధ్ర మరియు ఈస్ట్ గోదావరి జిల్లాల ప్రజలు అయితే ఈ సినిమాని ఒక ఉద్యమం లాగ చూసారు..ఈ రెండు ప్రాంతాలలో నాన్ రాజమౌళి రికార్డ్స్ కాదు..నాన్ చిరంజీవి రికార్డ్స్ అని చెప్పుకునే పరిస్థితి ఏర్పడిన ఆశ్చర్యపోనక్కర్లేదు..ఆ రెండు ప్రాంతాల నుండి డైలీ కలెక్షన్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి మరి.
వర్కింగ్ డేస్ లోనే అదరగొడుతున్న ఈ మూవీ కలెక్షన్స్ పబ్లిక్ హాలిడే ని మాత్రం ఎందుకు మిస్ అవుతుంది..నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాకి వచ్చిన వసూళ్లను చూసి ట్రేడ్ పండితులకు సైతం మతి పోయింది..కొత్త సినిమాలను కూడా డామినేట్ చేసి మరోసారి జనాలు ‘వాల్తేరు వీరయ్య’ కి జేజేలు పలికారు.

నిన్న రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ చిత్రానికి 6 నుండి 7 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ మరియు మూడు కోట్ల రూపాయిల షేర్ వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు..అదే కనుక జరిగితే 14 వ రోజు కూడా నాన్ రాజమౌళి రికార్డు ని సృష్టించిన చిత్రం గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..ఇక వీకెండ్ లో ఈ చిత్రం ఏ రేంజ్ వసూళ్లను సాధిస్తుందో..ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.