Varasudu Collections: తమిళ స్టార్ హీరో విజయ్ హీరో గా నటించిన ‘వారిసు’ చిత్రాన్ని తెలుగు లో ‘వారసుడు’ పేరు తో దబ్ చేసి జనవరి 14 వ తేదీన విడుదల చేసిన సంగతి తెలిసిందే..ప్రముఖ దర్శకుడు వంశి పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మించాడు..తమిళం లో విడుదలైన మూడు రోజుల తర్వాత తెలుగు లో విడుదలైంది..అయినా కూడా ఈ చిత్రానికి ఇక్కడ కళ్ళు చెదిరే వసూళ్లు వచ్చాయి..చిరంజీవి మరియు బాలయ్య వంటి టాప్ స్టార్ హీరోల సినిమాల మధ్యన విడుదల అవుతుంది..ఫ్లాప్ అవుతుందేమో అని అనుకున్నారు..కానీ ఈ చిత్రం బాలయ్య బాబు ‘వీర సింహా రెడ్డి’ కంటే కొన్ని ప్రాంతాలలో ఎక్కువ వసూళ్లను రాబట్టడం అందరినీ షాక్ కి గురి చేస్తుంది..తెలుగు లో ఈ సినిమా విడుదలై ఇప్పటికీ 9 రోజులు పూర్తి అయ్యింది..ఈ 9 రోజులకు గాను ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ప్రాంతాల వారీగా ఇప్పుడు మనం చూడబోతున్నాము.

ప్రాంతం: వసూళ్లు(షేర్):
నైజాం 5.12 కోట్లు
సీడెడ్ 2.21 కోట్లు
ఉత్తరాంధ్ర 2.24 కోట్లు
ఈస్ట్ 1.04 కోట్లు
వెస్ట్ 0.80 కోట్లు
నెల్లూరు 0.66 కోట్లు
గుంటూరు 0.95 కోట్లు
కృష్ణ 0.96 కోట్లు
మొత్తం 13.98 కోట్లు

ఒకప్పుడు తమిళ హీరోలైన సూపర్ స్టార్ రజినీకాంత్ , కమల్ హాసన్ , సూర్య వంటి వారికి తెలుగు మార్కెట్ లో ఒక రేంజ్ వసూళ్లు వచ్చేవి..వాళ్లకి ఆ రేంజ్ వసూళ్లు వచ్చే సమయం లో విజయ్ కి ఇక్కడ జీరో మార్కెట్ ఉండేది..ఆ స్థాయి నుండి నేడు కేవలం నైజాం ప్రాంతం లోనే 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు సాధించే రేంజ్ కి ఎదిగాడంటే తెలుగు లో విజయ్ మార్కెట్ ఏ రేంజ్ లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు..తుపాకీ మరియుఈ స్నేహితుడు సినిమాల నుండి విజయ్ సినిమాలు తెలుగు లో చూడడం ప్రారంభించారు ప్రేక్షకులు..అలా అంచలంచలుగా తన మార్కెట్ ని పెంచుకుంటూ నేడు తమిళ స్టార్ హీరోలందరికంటే తెలుగు లో అద్భుతమైన మార్కెట్ ని సంపాదించిన హీరో గా ఎదిగాడు విజయ్.