
Valentine Day Effect: ప్రేమికుల రోజు అందరు పూలతో తమ ప్రేమ వ్యక్తం చేయడం సహజం. కానీ ఈసారి పూలకు డిమాండ్ లేదట. వేటికి ఉందో తెలిస్తే షాకే. ప్రేమికుల ఆలోచన కూడా మారుతోంది. ఎక్కువ మంది లైంగికతకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. వాలంటైన్ డే సందర్భంగా పెద్ద మొత్తంలో కండోమ్ లు అమ్ముడయ్యాయంటే అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందరు ప్రేమను వ్యక్తం చేసేందుకు పూలనే ఎంచుకుంటారు. అందులో గులాబీలకు ఎక్కువ విలువ ఉంటుంది.కానీ ఈ సారి మాత్రం ఎక్కువ మొత్తంలో కండోమ్ లు అమ్ముడుపోవడం అందరిలో విస్మయం కలిగించింది. ప్రేమికులు తమ శారీరక సంబంధానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయం తెలిసిపోతోంది.
7 నుంచి 14 మధ్యలో..
ఫిబ్రవరి 7 నుంచి 14 మధ్యలోనే ఎక్కువ కండోమ్ ల విక్రయాలు చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ కాలంలోనే ఎక్కువ సంఖ్యలో ప్రేమికులు కండోమ్ లు వాడినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రేమను ప్రేమగా ప్రేమించకుండా కామంతో చూస్తున్నారని అర్థమవుతోంది. స్వచ్ఛమైన ప్రేమకు సరైన నిర్వచనం నిస్వార్థంగా ప్రేమించడమే అయినా వారిలో శారీరక వాంఛలు పెరుగుతున్నాయి. ప్రేమికుల రోజు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. అందులో టెడ్డీ బేర్, చాక్లెట్లు, పూలు ఉంటాయి. కానీ వీరు మాత్రం కండోమ్ లు వాడటం ఆందోళన కలిగిస్తోంది. వారి పంథా మారడంతో భవిష్యత్ లో ఇబ్బందులు పడతారని చెబుతున్నారు.
గతేడాది కంటే 22 శాతం
వాలంటైన్ డే నాడు కండోమ్స్, క్యాండిల్స్ అధిక మొత్తంలో అమ్ముడయ్యాయి. వీటితో పాటు డియోడొరాంట్స్, ఫర్ఫ్యూమ్స్, సింగిల్ రోస్ లు, బొకేలు, చాక్లెట్లు వంటివి కొనుగోలు చేశారు. వీటి అమ్మకాల గురించి సంబంధిత సంస్థలు ట్విట్టర్ లో పోస్టులు పెట్టడంతో విషయం వెలుగు చూసింది. పది వేల గులాబీలు, 1200 బొకేలు డెలివరీ అయ్యాయి. వాలంటైన్ డే సందర్భంగా పూలకన్నా కండోమ్స్ ఎక్కువగా అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 22 శాతం కండోమ్స్ అమ్మకాలు పెరిగాయి.

అంతర్జాతీయ కండోమ్స్ దినోత్సవం..
ఫిబ్రవరి 13 అంతర్జాతీయ కండోమ్స్ డే కావడంతో వీటి సేల్స్ పెరిగాయని అంటున్నా అసలు కారణం మాత్రం ఇదే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో లైంగిక సంబంధాల వల్ల కలిగే వ్యాధుల గురించి వారికి అవగాహన ఉన్నా తమ కోరికలు తీర్చుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. కండోమ్స్ వాడకంతో కలిగే దుష్ఫరిణామాల గురించి అవగాహన ఉన్నా వారి కోరికలు డామినేట్ చేస్తున్నాయనే విషయం అవగతమవుతోంది. అందుకే అధిక మొత్తంలో కండోమ్స్ కొనుగోలు చేసి తమ లైంగికాసక్తి పెంచుకోవడంతోనే వీటిని ఎక్కువగా కొన్నట్లు చెబుతున్నారు.
వ్యాధుల బారిన..
ప్రేమికుల ట్రెండ్ మారింది. ప్రేమలో పడితే ఇక లైంగికతకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో తమ శారీరక అవసరాలు తీర్చుకునేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో పలు వ్యాధుల బారిన పడతారని తెలిసినా వినడం లేదు. ఇప్పటికే ఎయిడ్స్ లాంటి వ్యాధితో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నా భయపడటం లేదు. లైంగిక వాంఛలతో రగిలిపోతున్నారు. కండోమ్స్ వాడుతూ తమ వాంఛలు తీర్చుకుంటున్నారు. కానీ భవిష్యత్ లో మరిన్ని ప్రమాదాలు కొనితెచ్చుకునే అవకాశాలుంటాయని మాత్రం మరిచిపోతున్నారు.