Homeఆంధ్రప్రదేశ్‌Sajjala Bhargav: వైసీపీ సోషల్ మీడియాలో చిచ్చు.. తండ్రి ఫార్ములాను అనుసరిస్తున్న సజ్జల భార్గవ్

Sajjala Bhargav: వైసీపీ సోషల్ మీడియాలో చిచ్చు.. తండ్రి ఫార్ములాను అనుసరిస్తున్న సజ్జల భార్గవ్

Sajjala Bhargav
Sajjala Bhargav

Sajjala Bhargav: లోకేష్ యువగళం పాదయాత్రను డీ గ్రేడ్ చేయడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతాకాదు.లోకేష్ ను టార్గెట్ చేసుకుంటూ మంత్రులు అటాక్ చేస్తున్నారు. వైసీపీ కీలక నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీఎదురుదాడి చేస్తున్నారు. వైసీపీ అనుకూల మీడియా గురించి చెప్పనక్కర్లడం లేదు. ఎక్కడో పదో అంతస్తు నుంచి ఫొటోలు తీసి పాదయాత్ర ఫెయిల్ అని చూపేందుకు తెగ ఆరాటపడుతోంది. లోకేష్ ప్రసంగాలు, ఇతరత్రా విషయాల్లో డొల్లతనం హైప్ చేస్తోంది. అసలు పాదయాత్రే వేస్ట్ అన్న రేంజ్ లో వ్యవహరిస్తోంది. ఇక వైసీపీ సోషల్ మీడియా అయితే మరీ అతిగా వ్యవహరిస్తోంది. లోకేష్ పాదయాత్రలో ఫెయిల్యూర్స్ ను కవర్ చేసేందుకు ఏకంగా 800 మంది యాక్టివిస్ట్ లను సోషల్ మీడియాలో ఏర్పాటుచేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Also Read: Home Minister Taneti Vanitha: పోలీసులనే అడ్డంగా బుక్ చేస్తున్న హోంమంత్రి..ఏదిపడితే అది మాట్లాడితే చిక్కులే

అయితే లోకేష్ పాదయాత్రను అట్టర్ ప్లాఫ్ చేసేందుకు వైసీపీ సోషల్ మీడియా ఇంటెలిజెన్స్ సహకారం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ ప్రచారం పెద్దగా వర్కవుట్ కావడం లేదు. దీంతో వైసీపీ నేతలు దీనిపై ఆరాతీస్తున్నారు. అయితే దీనిని సోషల్ మీడియా ఇన్ చార్జి సజ్జల భార్గవ్ కారణంగా తెలుస్తోంది. మొన్నటివరకూ సోషల్ మీడియా బాధ్యతలను విజయసాయిరెడ్డి చూసేవారు. కానీ సజ్జల పావులు కదిపి తన కుమారుడికి ఆ బాధ్యతలు ఇప్పించుకున్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పట్టు కోసమే తన కుమారుడికి కీలక బాధ్యతలు అప్పగించే అనివార్య పరిస్థితులు కల్పించారు.

Sajjala Bhargav
Sajjala Bhargav

పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సజ్జల మాటే ఇప్పుడు చెల్లుబాటవుతోంది. అటు సీఎం జగన్ కూడా ఎక్కువగా నమ్మేది సజ్జలనే. అయితే ఇంత ఉన్నా చేతిలో పదవి లేకపోయిందన్న బాధ సజ్జలలో ఉంది. ఆ ముచ్చట తన కుమారుడి ద్వారా తీర్చుకోవాలన్నది సజ్జల ఆలోచన. దానిలో భాగంగానే విజయసాయిరెడ్డి వద్ద ఉన్న సోషల్ మీడియా బాధ్యతలను కుమారుడికి ఇప్పించుకోగలిగారు. వచ్చే ఎన్నికల్లో కుమారుడ్ని ప్రత్యక్ష రాజకీయాల్లో దించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే భార్గవ్ రకరకాల ఫొటోలను లీకు చేస్తున్నారు. తన గురించి చర్చ జరిగేలా చూసుకుంటున్నారు.

అయితే ఈ క్రమంలో సోషల్ మీడియా యాక్టివిటీస్ తగ్గాయి. దీనికి భార్గవే కారణమన్న ఆరోపణలు కనిపిస్తున్నాయి. పార్టీలో తన తండ్రి పోషిస్తున్న పాత్రనే సోషల్ మీడియాలో కూడా చూపిస్తున్నారు. విజయసాయిరెడ్డితో పనిచేసిన టీమ్ ను ఏకంగా మార్చేశారు. తన సన్నిహితులు, స్నేహితులతో సోషల్ మీడియా వింగ్ ను నింపేస్తున్నారు. వారికే జీతాలు అధికంగా చెల్లిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో చిచ్చు రేగింది. దాని ప్రభావం పనితీరుపై చూపిస్తోంది. లోకేష్ పాదయాత్రను పనిగట్టుకొని ప్లాఫ్ షోలా చూపించాలన్న ప్రయత్నం ఫెయిలవ్వడానికి అదే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Also Read:Ex-Telangana CS Somesh Kumar: వీఆర్ఎస్ తో మళ్లీ కేసీఆర్ ఆస్థానంలోకి ‘సోమేష్’

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version