Uttar Pradesh: 35 ఏళ్లుగా అదే పని.. పూలన్ దేవితో సంబంధం.. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు.. ఆ తర్వాత..

బాల్ కిషన్ వృత్తిరీత్యా రైతు. ఇతడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఇతడు మీసాలు పెంచడం వెనక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది.. 1991లో ఒకరోజు పోలీసులు బాల్ కిషన్ ను అదుపులోకి తీసుకున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 4, 2024 5:38 pm

Uttar Pradesh

Follow us on

Uttar Pradesh: ఒక్కో మనిషికి ఒక్కో అలవాటు ఉంటుంది. కొంతమందికి జుట్టు పెంచుకోవడం ఇష్టం. కొంతమందికి గోర్లు పెంచుకోవడం ఇష్టం. మరి కొంతమందికి మీసాలను అలా వదిలేయడం మరింత ఇష్టం. ఇప్పుడు మీరు చదవబోయే వ్యక్తి కూడా అలాంటి ఇష్టాన్ని మరింత ఇష్టంగా మార్చుకున్నవాడే. అతని పేరు బాలకిషన్ రాజ్ పుత్. స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని హామీర్పూర్ జిల్లాలోని బరువా గ్రామం. అతని వయసు 64 ఏళ్ళు. బాలకిషన్ కు మీసాలు పెంచడం అంటే చాలా ఇష్టం. అతడు గత 35 సంవత్సరాలుగా అలానే మీసాలు పెంచుతున్నాడు. మజ్జిగలో ఉసిరి రసం పిండి మీసాలకు పట్టిస్తాడు. అలా అతడి మీసాలు ప్రస్తుతం 24 అంగుళాల సైజులో ఉన్నాయి.. చివరికి అతడి తండ్రి చనిపోయినప్పుడు కూడా మీసాలు కట్ చేయలేదు.

బాల్ కిషన్ వృత్తిరీత్యా రైతు. ఇతడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఇతడు మీసాలు పెంచడం వెనక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది.. 1991లో ఒకరోజు పోలీసులు బాల్ కిషన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఎందుకని అతడు ప్రశ్నించినప్పటికీ పోలీసులు స్పష్టమైన సమాధానం చెప్పలేదు. వారి వాహనంలో అతని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ లాకప్ లో పడేశారు. ఇతడి లాగానే మరి కొంతమందిని కూడా పోలీసులు పోలీసు స్టేషన్ కి తీసుకొచ్చారు. వారందరికీ కూడా పెద్ద పెద్ద మీసాలు ఉన్నాయి. వారిలో ఒక వ్యక్తికి 24 అంగుళాల మీసాలు ఉన్నాయి. ఆ తర్వాత అక్కడికి మేజిస్ట్రేట్ వచ్చారు.. లాకప్ లో ఉన్న అందర్నీ ఆయన ముందు నిల్చబెట్టారు.. పూలన్ దేవి ముఠాకు సంబంధించిన గజదొంగ లఖన్ సింగ్ ను గుర్తించేందుకు పోలీసులు ఇదంతా చేశారు. అప్పట్లో బాల్ కిషన్ మీసాలు 8 అంగుళాలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత అతని వైపు మున్సిపల్ మెజిస్ట్రేట్ చూసి నవ్వారు. అతన్ని తిడుతూ హేళనగా మాట్లాడారు. ఆ క్షణంలో మీసాలు పెంచాలని బాల్ కిషన్ నిర్ణయించుకున్నాడు. అయితే ఆ లాకప్ లో 24 అంగుళాల మీసాలు ఉన్న వ్యక్తి లఖన్ సింగ్ అనే బాల్ కిషన్ కు తర్వాత తెలిసింది.

పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత బాల్ కిషన్ మీసాలు పెంచడం ప్రారంభించాడు. అవి ఏపుగా పెరగడానికి పోషకాహారం తిన్నాడు. చివరికి వాళ్ల నాన్న చనిపోయినప్పుడు కూడా మీసాలు కత్తిరించలేదు. వాటి వరకు వదిలేసి మిగతా వెంట్రుకలు మొత్తం తొలగించుకున్నాడు. దాదాపు 33 సంవత్సరాలుగా బాల్ కిషన్ ఇలా మీసాలు పెంచుకుంటూనే ఉన్నాడు. అవి అతనికి ఎంతో పేరు తీసుకొచ్చాయి. చివరికి ఆ ప్రాంత మహిళలు కూడా అతని మీసాలను మెచ్చుకున్నారు. ఇలా అతడు మీసాలు పెంచినందుకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఐదువేల రూపాయల బహుమతి కూడా ఇచ్చారు.. అయితే ఇటీవల బాల్ కిషన్ అల్లుడు హత్యకు గురయ్యాడు. దానిపై ఫిర్యాదు చేసేందుకు అతడు జనతా దర్బార్ లో పాల్గొన్నాడు. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కు ఫిర్యాదు అందించి.. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.