Uttar Pradesh Two Sisters: ప్రేమకు స్వార్థం ఉండదు. ప్రేమిస్తే వారి క్షేమం కోసమే పాటుపడాల్సి ఉంటుంది. అదే నిజమైన ప్రేమగా భావిస్తారు. కానీ ఇక్కడ ప్రేమించిన పాపానికి ప్రేమికులు ఆస్పత్రి పాలైన ఘటన ఒకటి వెలుగు చూసింది. పెళ్లికి నిరాకరించారనే ఆగ్రహంతో ఆహారంలో విషం కలిపి వారిని అంతం చేయాలని కర్కశంగా ఆలోచించిన నిందితులు జైలు పాలయ్యారు. ఎలాంటి స్వార్థానికి లొంగనిది ఎంత త్యాగానికైనా వెనుకాడనిదే నిజమైన ప్రేమ. రానురాను ప్రేమలో కూడా ద్వేషాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఉత్తరప్రదేశ్ లోని జునైద్ పూర్ గ్రామంలో రాజకుమారికి ఇద్దరు కూతుళ్లు జ్యోతి, అర్చన. వీరు బులంద్ పూర్ కు చెందిన అభిషేక్, దీపక్ లను ప్రేమించారు. దీంతో అమ్మాయిల తల్లి వీరి వివాహానికి ఒప్పుకుంది. అబ్బాయిల తల్లిదండ్రులు మాత్రం వ్యతిరేకించారు. దీంతో వీరు ఆగ్రహంత రగిలిపోయారు. వారిని అంతం చేయాలని పథకం వేశారు. దీనికి వారు తినే ఆహారంలో విషం కలపాలని నిర్ణయించుకున్నారు.
Also Read: Jr NTR Birthday Special: ఎన్టీఆర్ సక్సెస్ వెనుక జీవితకాలపు మానసిక సంఘర్షణ ఉంది
ఇదే అదనుగా వారిని విందుకు రావాలని ఆహ్వానించారు దీంతో వారు కూడా సంతోషంగానే భావించి వచ్చి విందు ఆరగించారు. కానీ వారి పన్నాగం మాత్రం గుర్తించలేకపోవడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు.వీరిని పరిశీలించిన వైద్యుడు వీరి ఆహారంలో విషం కలిసిందని తేల్చారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు.

ఇలాంటి ఘటనే గుజరాత్ తో కూడా చోటుచేసుకుంది. నవ్ సారి జిల్లాకు చెందిన ఓ యువతి కోయంబత్తూర్ కు చెందిన రాజు పటేల్ తో పరిచయం పెంచుకుంది. దీంతో వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో కొన్ని రోజుల తరువాత వీరి మధ్య గొడవలు రావడంతో అతడిని దూరం పెట్టింది. ఈ నేపథ్యంలో ఆమెపై కోపం పెంచుకున్న రాజుపటేల్ ఆ యువతి చెల్లెలు పెళ్లిని అవకాశంగా చేసుకున్నాడు. వివాహానికి హాజరై ఓ బహుమతి ఇచ్చాడు.
దాన్ని యువతి మేనల్లుడు తీసి చూడగా అందులో ఉన్న బొమ్మను చూసి దానికి చార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా పేలింది. దీంతో పెళ్లికొడుకు, పిల్లాడికి తీవ్ర గాయాలయ్యాయి. అది తీసుకొచ్చింది రాజు పటేల్ అని గుర్తించారు. ఆమె చెల్లెలు పెళ్లిని సావకాశంగా చేసుకుని ఇలా కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నించడం అందరిని భయానికి గురి చేసింది.