Uttar Pradesh: ఇటీవల అగ్ని ప్రమాదాలు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. నగరాల్లోని పెద్దపెద్ద భవనాల్లో ప్రమాదం జరిగినప్పుడు ఫైరింజన్‌లు అందులోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో మంటలను అదుపు చేయడం ఫైర్ సిబ్బందికి ఇబ్బందిగా మారుతోంది. ఈ సమయంలో పలువురు మృత్యువాత పడరతున్నారు. ఇటీవల హైదరాబాద్ జరిగిన అగ్ని ప్రమాదంలో పలురువు మృత్యువాతపడ్డారు. తాజాగా నోయిడాలోని ఎక్స్‌టెన్షన్‌లోని గెలాక్సీ ప్లాజాలో గురువారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి ఈ ప్రమాదం నుంచి ఐదుగురు గాయపడ్డారు.
మూడో అంతస్తులో మంటలు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భవనంలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. బిస్రఖ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ బిస్రఖ్, అగ్నిమాపక యూనిట్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ‘షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని మాకు తెలిసింది. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు‘ అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ఐదు యంత్రాలతో మంటల అదపు..
ఇదిలా ఉండగా, భవనంలో చెలరేగిన మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది ఐదు వామనాలను రప్పించారు. వీటి సహాయంతో మంటలను అదుపు చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారి తెలిపారు.
కిందకు దూకుతున్న దృశ్యాలు..
ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భవనం లోపల దట్టంగా పొగ అలుముకోవడంతో తప్పించుకోవడానికి ఒక జంట కిటికీ నుంచి కిందికి దూకడానికి ప్రయత్నిండం ఆ వీడియోలో కనిపిస్తుంది. మరో వీడియో లో ఒక వ్యక్తి అలాగే దూకుతున్నట్లు చూపిస్తుంది.
భయంతోనే..
ఒకవైపు మంటలు, మరోవైపు దట్టమైన నల్లని పొగ.. దీంతో భయపడిన భవనంలోని జనం ప్రాణాలు కాపాడుకోవడానికి అన్ని దారులు వెతికారు. అయితే అందరూ ఒకచోటకు వెళ్తే కిందకు దిగడం కష్టమని భావించిన బాధితులు చాలా మంది కిటికిల్లో నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.
Video: Fire in shopping complex in #GreaterNoida; people jump through windows to save themselves pic.twitter.com/FRADglNXxU
— TOI Cities (@TOICitiesNews) July 13, 2023