Joe Biden Son: అమెరికా ప్రథమ పౌరుడు జో బైడెన్ ఎప్పుడు వివాదాల్లో ఇరుక్కుంటుంటారు. అవడానికి అమెరికా అధ్యక్షుడైనా ఎప్పుడూ వివాదాల్లోనే ఉండటం ఆయనకో సరదాలా అనిపిస్తుందేమో అంటుంటారు. ప్రస్తుతం ఆయన కుమారుడు చేసిన పెంటకు బైడెన్ నిందితుడిగా నిలబడాల్సి వస్తోంది. దేశానికి సేవ చేయాల్సిన పదవిలో ఉన్న బైడెన్ కుమారుడి తీరుతో తలెత్తుకోలేకపోతున్నారు. అతడి సుపుత్రుడు చేసిన పనికి సిగ్గుతో తలదించుకుంటున్నారు. అమెరికా లాంటి అగ్రరాజ్యానికి అండగా ఉంటానని ప్రమాణం చేసిన బైడెన్ ఇప్పుడు కుమారుడి లీలలతో తర్జనభర్జన పడుతున్నారు. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలనే చిక్కుల్లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది.

జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ పెద్ద తప్పే చేశాడు. తన సుఖం కోసం అమ్మాయిలతో సరదాలు తీర్చుకుంటున్నారు. కాల్ గర్ల్స్ కు డబ్బులు ధారపోసినట్లు ఆధారాలు దొరికాయి. దీంతో అతడు ముద్దాయిగా బోను ఎక్కాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో బైడెన్ అధ్యక్ష పదవికి సైతం మచ్చ రానుంది. బైడెన్ కొడుకు ఇలా చేశాడని అంటే ఆయనకు ఎంత చులకనగా ఉంటుంది. కొడుకును సరైన దారిలో పెంచకపోతే ఇలాంటి సమస్యలే ఎదురవుతాయి. ఇప్పుడు ఎఫ్ బీఐ వద్ద ఉన్న ఆధారాలతో బైడెన్ కు నిద్ర పట్టడం లేదు.
Also Read: Chandrababu-BJP: బీజేపీ, టీడీపీ ఇలా కలుసుకున్నాయన్న మాట.. చంద్రబాబు కాస్తా ఊరట
నవంబర్ 2018 నుంచి 2019 మార్చి వరకు అతడు చేసిన జల్సాలకు సంబంధించిన చెక్కులు, చాటింగులు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి గాను రూ. 24 లక్షలు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. దీంతో ఆధారాలు పక్కాగా ఉండటంతో అతడిపై శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. సెక్స్ కోసం ఇతర రాష్ర్టాల నుంచి అమ్మాయిలను పిలిపించుకున్నట్లు సమాచారం. దీంతో అతడిపై పలు కోణాల్లో కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయి. జోబైడెన్ ప్రతిష్టకు భంగం కలిగించే పనిలో అతడి నిర్వాకాలు ఉన్నట్లు తెలిసిందే.

కాల్ గర్ల్స్ తో ఉన్న ఫొటోలు, వీడియోలు లభించడంతో హంటర్ భవితవ్యం ఏమిటనేది తెలియడం లేదు. ఈ కోణంలో విచారణ చేపడితే మరిన్ని నిజాలు వెలుగు చూసే వీలుంది. దీంతో బైడెన్ కు తలనొప్పిగా మారనుంది. అమెరికా లాంటి అగ్రరాజ్యంలో ఆరోపణలు ఎదుర్కొన్నా ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవడం ఇబ్బందికరమే. దీంతో అధ్యక్ష పదవికి కూడా ఏదైనా ముప్పు వాటిల్లే ప్రమాదముంటుందా అనే కోణంలో రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పండిత పుత్రా పరమ సుంఠా అన్నట్లు జోబైడెన్ కుమారుడి లీలల వల్ల ఆయనకు ఇబ్బందులు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read:Top Heroines Mistakes: టాప్ హీరోయిన్లు చేసే అతిపెద్ద పొరపాటు ఏది?