US Nurse: నర్సు అనగానే రోగులకు సేవ చేసే నైటింగేల్ గుర్తొస్తారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా వృత్తి ధర్మాన్ని నెరవేర్చే వారిలో నర్సులు కూడా ఉన్నారు. కుటుంబ సభ్యులు చేయలేని సపరియలు కూడా నర్సులు చేస్తారు. అయితే ఇక్కడ ఓ నర్సు రాక్షసిలా మారింది. రోగులను పొట్టన పెట్టుకుంది. దీంతో కోర్టు ఆ నర్సుకు ఏకంగా 760 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఇంతకీ ఈ రాకాసి నర్సు ఎవరు.. ఏం జరిగింది తెలుసుకుందాం.
అమెరికా నర్సు..
అగ్రరాజ్యం అమెరికాలోని పెన్సిల్వేనియాలో హిథర్ ప్రసెస్డీ(41) అనే నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష పడింది. మూడు హత్య కేసుల్లో దోషిగా తేలడంతో కోర్టు మూడు జీవిత కాలాలపాటు(760 ఏళ్లు) జైలు శిక్ష విధించింది. మూడేళ్లు ప్రాణాంతకమైన ఇన్సులిన్‌ను అధిక మోతాదులో ఇవ్వడంతో 17 మంది రోగులు ప్రాణాలు కల్పోయారు. మూడు హత్యలు, 19 హత్యాయత్నం కేసుల్లో నేరాన్ని ంగీకరించడంతో, కేసులో దోషిగా తేలడంతో కోర్టు ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
22 మందికి అధిక డోసు..
ప్రెస్డీ 22 మంది రోగులకు అధిక మొత్తంలో ఇన్సులిన్ ఇచ్చినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. వీరిలో చాలా మంది రోగులు మోతాదు తీసుకున్న వంఎటనే లేదా కొంత సమయం తర్వాత మరణించారు. బాధితులు 43 నుంచి 104 ఏళ్ల మధ్య వయసువారు. ఇద్దరు రోగులను చంపినందుకు ఆమెపై తొలుత అభియోగాలు మోపారు. తర్వాత జరిగిన విచారణలో మర్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక అభియోగాలు నమోదు చేసిన అనంతరం ఆమె నర్సింగ్ లైసెన్స్ కూడా రద్దు చేశారు.
మానసిక పరిస్థితి బాగన్నా..
ప్రెస్డీకి ఎలాంటి జబ్బు లేదు. మతి స్థిమితమూ లేదు. మానసిక పరిస్థితి బాగానే ఉంది. కానీ ఆమెది దుష్ట వ్యక్తిత్వం అని నిర్ధారణ అయింది. ఆమె తండ్రిని కూడా ప్రెస్డీ చంపేసింది. రోగులు, సహోద్యోగులతో కూడా దురుసుగా ప్రవర్తించేదని విరారణలో అధికారులు గుర్తించారు.