
Kabzaa Sequel: ఇటీవల కాలం లో భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన చిత్రం ‘కబ్జా’.కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరో గా నటించిన ఈ సినిమాకి సుమారుగా వంద కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ని పెట్టి తీశారు.ఇది కన్నడ సినీ పరిశ్రమకి చాలా ఎక్కువ మొత్తం.
ఉపేంద్ర తో పాటుగా ఇందులో కన్నడ స్టార్స్ కిచ్చా సుదీప్, మరియు శివ రాజ్ కుమార్ వంటి నటులు కూడా ఉన్నారు.టీజర్ మరియు ట్రైలర్ నుండి భారీ హైప్ ని పెంచిన సినిమా మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని తెచ్చుకుంది.భారీ హైప్ ఉండడం వల్ల మొదటి రోజు 13 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.ఇది డీసెంట్ ఓపెనింగ్ అయ్యినప్పటికీ కూడా, పెట్టిన బడ్జెట్ కి వచ్చిన ఓపెనింగ్ చిల్లరే అని చెప్పొచ్చు.

నిన్ననే ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో అన్నీ ప్రాంతీయ బాషలలో విడుదల చేసారు.థియేటర్స్ లో ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో, ఇక్కడ కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.ఇంత పెద్ద ఫ్లాప్ అయినా ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ R చంద్రు.ఇతనికి మతి స్థిమితం సరిగా ఉందో, లేదా అరుణాచలం సినిమాలో రజినీకాంత్ లాగా ఉన్న డబ్బు మొత్తాన్ని పోగొట్టాలనే కసి ఉందో తెలియదు కానీ, ఒక డిజాస్టర్ సినిమాకి సీక్వెల్ తియ్యడం అనేది నిజంగా తెలివితక్కువ చర్య.
మరి ఇందుకు నటీనటులైన ఎలా ఒప్పుకొని చేస్తున్నారో, ఇది నిజంగా ఆశ్చర్యానికి గురి చేసే విషయం.త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్నామని, స్క్రిప్ట్ వర్క్ ప్రారంభం అయ్యింది అంటూ ఆ చిత్ర దర్శకుడు ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేసాడు.దీనికి నెటిజెన్స్ నుండి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.