UP School Teacher: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చేతిలో కి మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ వీడియోలు తీసి అప్లోడ్ చేస్తూ సందడి చేస్తున్నారు. మొదట్లో టిక్ టాక్ కు అలవాటు పడిన వారు… దానిని బ్యాన్ చేసిన తరువాత రీల్స్ చేస్తూ యూట్యూబ్, ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేస్తూ వైరల్ చేస్తున్నారు. చాలా మంది యూత్ ఈ రీల్స్ పేరిట పలు వీడియోలు తీస్తున్నారు. ఈ మధ్య కొందరు మహిళలు కూడా డ్యాన్స్ లు చేస్తూ వీడియోలను పెడుతున్నారు. అయితే తాజాగా ఇలాంటి వద్దని చెప్పాల్సి ఉండగా.. పాఠశాలలో విధులు మరిచి మరీ రీల్స్ చేసింది. దీంతో కొందరు విద్యార్థులు ఈ వీడియోను తీసి పోస్టు చేశారు. ఆ తరువాత ఏం జరిగిందంటే?
ఏదైనా సాంగ్ హిట్టయితే చాలు.. దానిపై డ్యాన్స్ చేస్తూ కొందరు రీల్స్ చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ మోజులో పడి ప్రభుత్వఉద్యోగులు సైతం రీల్స్ చేస్తున్నారు. కొన్ని నెలల కిందట ఓ పోలీస్ అధికారిణి ఇలాంటి వీడియోలు చేస్తే ఆమె ఉద్యోగం ఊడిన విషయం తెలిసిందే. తాజాగా విద్యాబుద్దులు చెప్పాల్సిన ఓ టీచర్.. తన విధులను నిర్వర్తించకపోవడమే కాకుండా డ్యాన్స్ చేస్తూ రీల్స్ తీయ సాగింది.
ఉత్తరప్రదేశ్ లోని బలన్ షహర్ జిల్లాలోని అప్పలర్ ప్రైమర్ స్కూల్ లో ప్రభా నేగి అనే టీచర్ పనిచేస్తోంది. ఈమె సోషల్ మీడియాలో ట్రెండీగా కావాలని తరగతిగదిలోనూ రీల్స్ చేయసాగింది. 1990లో విడుదలయిన ‘ఆషీకీ’ అనే చిత్రంలోని ‘ధీరే ధీరేసే మేరీ జిందగీ మే ఆనా’ అనే సాంగ్ కు డ్యాన్స్ చేసింది. ఈమె డ్యాన్స్ చేసిన వీడియోను విద్యార్థులు వీడియో తీశారు. ఈ వీడియో తోటి ఉపాధ్యాయులకు చేరడంతో ఆమెను మందలించారు. అయినా వారికి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. అయితే ఈ విషయం విద్యాశాఖకు వెళ్లడంతో ఆమెపై చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. పిల్లలకు బుద్దులు నేర్పాల్సిన టీచర్ తరగతి గదిలో ఇలా డ్యాన్స్ చేయడంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
विद्यार्थियों को उच्च कोटि की शिक्षा देने के साथ विशेष एक्टिविटी सिखाते हमारे आज के शिक्षक…
बुलंदशहर से शिक्षिका प्रभा नेगी का आपत्तिजनक वीडियो वायरल… अब बच्चों से क्या ही उम्मीद की जाए।pic.twitter.com/nB75FPttL2— Gauri Trivedi (@Gauritrivedee) September 13, 2023