Seema Haider- Sachin: భారతీయుడి కోసం పాకిస్తాన్‌ వదిలి వచ్చిన వివాహిత ప్రేమకథ..

ఇదిలా ఉంటే సీమా మొదటి భర్త హైదర్‌ అలీ సౌదీలో లో పని చేస్తున్నాడు. మూడేళ్లుగా సీమా తన పిల్లలతో పాకిస్థాన్‌లో అద్దె ఇంట్లో ఉంది. అయితే ఈ విషయంపై తాజాగా స్పందించిన ఆమె కుటుంబ సభ్యులు ఒక భారతీయుడు కోసం వెళ్లిపోయిన ఆమెతో తమకు ఎటువంటి సంబంధం లేదని. ఇక ఆమె పాకిస్తాన్‌కు తిరిగి రావాల్సిన అవసరం కూడా లేదని తెలిపారు.

Written By: Raj Shekar, Updated On : July 18, 2023 2:24 pm
Follow us on

Seema Haider- Sachin: పబ్జీ.. ఇదొక ఆన్‌లైన్‌ గేమ్‌. ఇది అంత్యం ప్రమాదకరమైన ఆట. దీని కారణంగా యువకులు, పిల్లలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇదే గేమ్‌.. కరోనా టైమ్‌లో ఇద్దరి మధ్యప్రేమ చిగురింపజేసింది. శత్రుదేశాలైన భారత్‌ యువకుడితో పాకిస్తాన్‌ యువతి ప్రేమలో పడింది. అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలు ఉన్న సదరు మమిళ.. ప్రేమ కోసం దేశం విడిచి భారత్‌లో అక్రమంగా చొరబడింది. గత కొద్ది రోజులుగా అనేక ట్విస్టులు తీసుకుంటున్న పబ్జీ ప్రేమ కథ మరొకసారి వార్తల్లో నిలిచింది. కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో మొదలైన ఈ పబ్జీ ప్రేమాయణం కారణంగా సీమా హైదర్‌ అనే పాకిస్తానీ మహిళ పాకిస్తాన్‌ విడిచిపెట్టి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. సచిన్‌ మీనా అనే వ్యక్తితో పబ్జీ గేమ్‌ లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఈ నలుగురు పిల్లల తల్లి అతని కోసం పిల్లలతో సహా భారత్‌కు చేరుకుంది. ఇప్పుడు ఇద్దరూ పెళ్లి చేసుకుని పిల్లలతో కలిసి హాయిగా సెటిల్‌ అయిపోయారు.

అక్రమ చొరబాటు కేసుతో..
గ్రేటర్‌ నోయిడాలో ఫ్లాట్‌ అద్దెకు తీసుకొని ఉంటున్న సీమా హైదర్‌పై అక్రమ చొరబాటు కేసు నమోదు కావడం ఆ తర్వాత హైకోర్టు ఆమెకు బెయిల్‌ మంజూరు చేయడం అందరికీ తెలిసిందే. ఇక తర్వాత తిరిగి పాకిస్తాన్‌ వెళ్లనని తను హిందువుగా ఉండడానికే ఇష్టపడుతున్నానని ఆమె తేల్చి చెప్పింది. ఇందుకోసం అధికారులను కూడా సంప్రదిస్తానని సీమా తెలిపారు. పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లడం ఇష్టం లేదని ఒకవేళ వెళ్లినా అక్కడ తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంది.

Seema Haider- Sachin

సౌదీలో మొదటి భర్త..
ఇదిలా ఉంటే సీమా మొదటి భర్త హైదర్‌ అలీ సౌదీలో లో పని చేస్తున్నాడు. మూడేళ్లుగా సీమా తన పిల్లలతో పాకిస్థాన్‌లో అద్దె ఇంట్లో ఉంది. అయితే ఈ విషయంపై తాజాగా స్పందించిన ఆమె కుటుంబ సభ్యులు ఒక భారతీయుడు కోసం వెళ్లిపోయిన ఆమెతో తమకు ఎటువంటి సంబంధం లేదని. ఇక ఆమె పాకిస్తాన్‌కు తిరిగి రావాల్సిన అవసరం కూడా లేదని తెలిపారు.

పిల్లల్ని పంపాలని డిమాండ్‌..
అయితే నలుగురు పిల్లల్ని మాత్రం పాకిస్తాన్‌కు పంపాలని మొదటి భర్త, బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు. పిల్లలు తనవారని, వాళ్లు పాకిస్తానీలని, వారిని పాకిస్తాన్‌కే పంపించాలని అంటున్నారు. ఈమేరకు పాకిస్తాన్‌ అధికారుల ద్వారా భారత అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మరి దీనిపై సీమా ఎలా స్పందిస్తుందో చూడాలి.