Unstoppable With NBK: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..ఇప్పుడు ఆ షో కి కొనసాగింపుగా రెండవ సీజన్ ప్రారంభమై మూడు ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకోగా, ఈ మూడు ఎపిసోడ్స్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది..ఇప్పుడు నాల్గవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని ఈరోజు విడుదల చెయ్యగా అది సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఈ ఎపిసోడ్ కి బాలయ్య బాబు మిత్రుడు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మరియు శాసన సభ స్పీకర్ సురేష్ రెడ్డిలతో పాటు ప్రముఖ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ కూడా హాజరయ్యారు..ఆద్యంతం సరదాగా సాగిపోయిన ఈ ప్రోమో చూస్తుంటే ఈ ఎపిసోడ్ కూడా పెద్ద హిట్ అయ్యేలా అనిపిస్తుంది..అంతే కాకుండా బాలయ్య బాబు మాజీ ముఖ్యమంత్రి దివంగత వై ఎస్ రాజశేఖర్ గురించి చేసిన కొన్ని కామెంట్స్ కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి.
ముందుగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ‘రాజశేఖర్ రెడ్డి ని పక్కనే అంటిపెట్టుకొని ఉండే ఒక మంత్రి బాగా మ్యానిప్యులేట్ చేసాడు..అలా చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు’ అంటాడు..అప్పుడు బాలయ్య బాబు మాట్లాడుతూ ‘మన ఆంధ్ర ప్రదేశ్ లో ఎందరో మహానుభావులు ఉన్నారు..వారిలో రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఒకరు’ అని చెప్తాడు..ఈ ప్రోమో చూసి ఒక్కసారిగా అందరు షాక్ కి గురి అవుతారు..తెలుగు దేశం పార్టీ అభిమానులకు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని పొగిడితే అసలు నచ్చదు అనేది తెలిసిందే.

గతం లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇలాగె మాట్లాడితే టీడీపీ కార్యకర్తలు మరియు నాయకులూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు..సోషల్ మీడియా లో కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుండి చాలా తీవ్రమైన విమర్శలు ఎదురుకోవాల్సి వచ్చింది..ఇప్పుడు బాలయ్య కి కూడా అదే గతి పట్టనుందా లేదా అనేది చూడాలి..ఈ ఎపిసోడ్ నవంబర్ 25 వ తేదీన ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.