Ginger Benefits: మనం రోజు తీసుకునే మసాలా దినుసుల్లో అల్లం కూడా ఒకటి. దీంతో మనకు ఎన్నో లాభాలున్నాయి. కానీ దీన్ని ఏదైనా మాంసాహార వంటల్లోనే ఎక్కువగా వాడుతుంటాం. కానీ అన్నింట్లో దీన్ని వాడుకుంటే మనకు పలు ప్రయోజనాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. అల్లం రుచిలో చేదు, కారం కలిసినట్లు ఉన్నా మన దేహానికి మాత్రం ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఎక్కువ మంది టీలో కూడా అల్లం వేసుకుంటారు. ఇందులో ఉండే జింజెరాల్, షోగాల్, జింజిబెరెన్ లు ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడతాయి. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు మనకు లాభాలు తెస్తాయి. అందుకే అల్లంను మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారనే విషయం చాలా మందికి తెలియదు.

అల్లంలోని జింజెరాల్ వాంతులు రాకుండా నిరోధిస్తుంది. కీళ్లవాపులను తగ్గిస్తుంది. షోగాల్ క్యాన్సర్, గుండెజబ్బులకు దూరంగా ఉంచుతుంది. జింజిబెరెన్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇంకా అల్లం మన మెదడు బాగా పనిచేసేందుకు కారణమవుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో మన శరీరానికి బలం పెరుగుతుంది. రోజు నాలుగు గ్రాములు అల్లం ముక్కను నేరుగా తినొచ్చు. లేదా కూరలో గానీ టీలో, సలాడ్లలో వేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. ప్రతి రోజు అలా అల్లం తింటే నెల రోజుల్లో మన శరీరంలో మార్పులు కనిపిస్తాయి.
శరీరంలో వేడి, నొప్పులు, వాపులు వంటి ఉన్నా అల్లంతో నయమవుతాయి. తరచూ వేడి చేస్తే ముసలి తనం తొందరగా రాదు. శరీరానికి అల్లం అవసరం ఎక్కువగానే ఉంటుంది. గర్భిణులకు కూడా అల్లం సహాయపడుతుంది. కడుపులో వికారంగా అనిపించినప్పుడు అల్లం తింటే ఉపశమనం లభిస్తుంది. అల్లం వాసన కూడా వికారాలను తగ్గిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కండరాల నొప్పులను లేకుండా చేస్తుంది. మనం తిన్న ఆహారం జీర్ణం కాకపోతే అల్లంతో పరిష్కారం లభిస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు అల్లం దాన్ని దూరం చేస్తుంది.

రుతుక్రమంలో ఏర్పడే నొప్పులను కూడా అల్లం మార్గం చూపుతుంది. గుండెలో ఏర్పడే కొవ్వులను కరిగిస్తుంది. ఫలితంగా గుండె జబ్బులు రాకుండా నిరోధిస్తుంది. రక్తంలో ట్రైగ్లిసెరైడ్ లను తగ్గిస్తుంది. దీంతో చెడు కొవ్వు నిలువ ఉండకుండా చేస్తుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, కఫం వంటి వాటికి కూడా మందులా ఉపయోగపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉండటంతో రోజు నాలుగు గ్రాముల అల్లం తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవని వైద్యులు సూచిస్తున్నారు.