Unstoppable Season 2- Prabhas: అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK 2 ‘ ప్రభాస్ ఎపిసోడ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది..ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసారు..ముందుగా సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు ప్రోమోని విడుదల చేస్తాము అని ప్రకటించారు..కానీ ఆ సమయానికి విడుదల చెయ్యలేదు..ఆ తర్వాత 8 గంటల 15 నిమిషాలకు విడుదల చేస్తాము అని చెప్పారు..కానీ అప్పటికీ విడుదల కాలేదు.

అలా వాయిదాలు వేసుకుంటూ, అభిమానుల సహనం ని పరీక్షిస్తూ 11 గంటల 15 నిమిషాలకు విడుదల చేసారు..అది కూడా ప్రోమో కాదు..ప్రోమో కి గ్లిమ్స్ అన్నమాట..మెయిన్ ప్రోమో త్వరలో విడుదల చేస్తాము అని చెప్పారు కానీ..డేట్ ఎప్పుడో చెప్పకుండా సస్పెన్స్ మైంటైన్ చేసారు..పాపం ప్రభాస్ ఫ్యాన్స్ కి చివరికి నిరాశే మిగిలింది..ప్రోమో నే ఇంత లేట్ గా విడుదల చేస్తే ఇక ఎపిసోడ్ ని ఎప్పటికి విడుదల చేస్తారో అని అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
సాధరణంగా ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ కొత్త ఎపిసోడ్స్ ప్రతి శుక్రవారం ప్రసారం స్ట్రీమింగ్ అవుతూ ఉంటుంది..కానీ ఈసారి ఈ వారం స్ట్రీమింగ్ అవుతుందా..లేదా అభిమానులను ఇలాగే కొంతకాలం ఊరించి లేట్ గా విడుదల చేస్తారా అనేది చూడాలి..ఇక నిన్న రాత్రి విడుదల చేసిన ఈ చిన్న గ్లిమ్స్ వీడియో లో ప్రభాస్ కి రామ్ చరణ్ వీడియో కాల్ చేస్తాడు..ఈ వీడియో కాల్ లో రామ్ చరణ్ ప్రభాస్ కి సంబంధించిన సీక్రెట్ విషయాన్నీ చెప్పే ప్రయత్నం చేస్తాడు.

అప్పుడు ప్రభాస్ ‘రేయ్..ఏమి చెప్తున్నావ్ డార్లింగ్’ అంటాడు..ఈ గ్లిమ్స్ లో ఇదే హైలైట్ గా నిలిచింది..అలా ఈ ఎపిసోడ్ మొత్తం ఫుల్ ఫన్ తో సరదాగా గడిచిపోతుంది అని ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది..ఇక ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ తో పాటుగా హీరో గోపీచంద్ కూడా పాల్గొంటాడు..నిన్న విడుదల చేసిన ప్రోమో గ్లిమ్స్ లో ఆయన కూడా ఉన్నాడు.
https://www.youtube.com/watch?v=qdUXtL5CwFE