
NBK 108: బాలయ్య ఫ్యాన్స్ ఒక విషయంలో అదృష్టవంతులని చెప్పాలి. ఇతర హీరోల అభిమానుల మాదిరి ఏళ్లకు ఏళ్ళు సినిమా కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. అప్డేట్స్ అడుక్కోవాల్సిన పనిలేదు. ఫ్యాన్స్ అడగకముందే అప్డేట్ సిద్ధంగా ఉంటుంది. ఒక మూవీ విడుదల కాకుండానే మరో మూవీ ప్రకటిస్తారు. దాన్ని వెంటనే పట్టాలెక్కిస్తారు. రెగ్యులర్ షూట్ మొదలైతే ఆరు నెలల్లో సినిమా సిద్ధమైపోతుంది. బాలయ్య ఎనర్జీ అంటే అది. దర్శకులను, నిర్మాతలను ఆయన పరుగులు పెట్టిస్తారు.
అఖండ, వీరసింహారెడ్డి చిత్ర విజయాలతో ఊపు మీదున్న బాలయ్య ఎన్బీకే 108 వాయువేగంతో పూర్తి చేస్తున్నారు. రిలీజ్ టైం కూడా ఫిక్స్ చేశారు. దసరా కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. ఈ మేరకు నేడు అధికారిక ప్రకటన చేశారు. ‘విజయదశమికి ఆయుధ పూజ’ అంటూ ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. సదరు పోస్టర్లో బాలయ్య సీరియస్ అండ్ ఇంటెన్స్ లుక్ కేక పుట్టిస్తుంది.
అలాగే త్వరలో టైటిల్ అండ్ రిలీజ్ డేట్ ప్రకటిస్తారట. విజయదశమికి విడుదలని చెప్పి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వీరసింహారెడ్డి విడుదల చేసిన ఎనిమిది నెలల్లోనే బాలయ్య థియేటర్స్ లో దిగుతున్నాడన్నమాట. తారకరత్న మరణం కారణంగా సెకండ్ షెడ్యూల్ కొంచెం ఆలస్యమైంది. లేకుంటే ఆగస్టులోనే సినిమా విడుదల చేసేవారేమో.

దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్ర దర్శకుడిగా ఉన్నారు. తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుందని అనిల్ రావిపూడి తెలియజేశారు. హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. ప్రధాన తారాగణం పాల్గొంటుండగా… కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కెరీర్లో మొదటిసారి కాజల్-బాలయ్య జతకడుతున్నారు. శ్రీలీల కీలక రోల్ చేస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు.
దశమి కి ఆయుధపూజ 🔥
This VIJAYADASHAMI make a way for the NATAMSIMHAM to conquer the evil forts😎#NBK108 Title & Release Date Soon💥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna @Shine_Screens pic.twitter.com/hp1tGho2Kr
— Anil Ravipudi (@AnilRavipudi) March 31, 2023