Homeట్రెండింగ్ న్యూస్UK Woman: సరైన జోడీ దొరకలేదని.. తనను తానే పెళ్లి చేసుకుంది.. పెళ్లి ఖర్చు వింటే...

UK Woman: సరైన జోడీ దొరకలేదని.. తనను తానే పెళ్లి చేసుకుంది.. పెళ్లి ఖర్చు వింటే షాక్‌ అవ్వాల్సిందే..

ఓ మహిళా తనని తానే పెళ్లి చేసుకుంది. తనకు సరైన జోడీ కోసం 20 ఏళ్లు వేచిచూసింది. చివరకు పెళ్లి మిస్‌ కాకూడదని 42 ఏళ్ల వయసులో తనను తానే పెళ్లి చేసుకుంది.

UK Woman: మనిషి జీవితంలో పెళ్లికి చాలా ప్రాధాన్యత ఉంది. ›ప్రతీ స్త్రీ,పురుషుల జీవితంలో వివాహం అనేది కీలక ఘట్టం. ఇందులో కులం, మతానికి తావులేదు. ఎవరి సంప్రదాయం ప్రకారం వారు వయసు వచ్చాక వివాహం చేసుకుంటారు. అయితే ఈ పెళ్లి కోసం యువతీ యువకులు కలలు కంటారు. కాబోయే భార్య/భర్త ఎలా ఉండాలో ఊహించుకుంటారు. అందుకోసం సంబంధాలు చూస్తుంటారు. ఎందుకంటే కష్టసుఖాల్లో చివరి వరకు తోడుండేది కేవలం జీవిత భాగస్వామి మాత్రమే. అయితే మనకి నచ్చిన వ్యక్తిని అన్నివిధాలా మనకి సరిపోయే వ్యక్తిని ఎంపిక చేసుకోవడం కష్టం. అయితే తల్లిదండ్రులు చూసిన సంబంధాలను చేసుకుని కష్టమో నష్టమో కలిసి బ్రతికేవాళ్లు కొందరు, ప్రేమించి పెళ్లిళ్లు చేసుకునే వాళ్లు కొందరు. స్నేహితులని వదిలి ఉండలేక ఒకే జెండర్‌ వ్యక్తుల్ని పెళ్లి చేసుకునే వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఈ పెళ్లి మాత్రం కనీవిని ఎరుగని రీతిలో జరిగింది. ఓ మహిళా తనని తానే పెళ్లి చేసుకుంది. తనకు సరైన జోడీ కోసం 20 ఏళ్లు వేచిచూసింది. చివరకు పెళ్లి మిస్‌ కాకూడదని 42 ఏళ్ల వయసులో తనను తానే పెళ్లి చేసుకుంది. ఇందుకోసం రూ.10 లక్షల ఖర్చు చేసింది. ఈ వింత ఘటన లండన్‌లో జరిగింది.

జోడీ కోసం 20 ఏళ్లు నిరీక్షణ..
లండన్‌లోని సారా విల్కిన్సన్‌ అనే మహిళ క్రెడిట్‌ కంట్రోలర్‌గా పని చేస్తున్నారు. ఆమె వయసు 42 సంవత్సరాలు. అందరు యువతుల్లానే తను కూడా తనకు సరైన జోడీ కోసం ఎదురు చూసింది. తన పెళ్లికి తానే డబ్బులు కూడా కూడబెట్టింది. తన 20 ఏట నుంచే పొదుపు చేస్తూ వచ్చింది. ఇలా 20 ఏళ్లు గడిచినా ఆమె కోరుకున్న లక్షణాలు ఉన్న వరుడు ఆమెకి చిక్కలేదు. దీంతో చిరవకు ఓ నిర్ణయానికి వచ్చింది.

తనను తానే పెళ్లి చేసుకుని..
ఇంకా ఎదురు చూస్తే జీవితంలో కీలక ఘట్టం అయిన పెళ్లిని మిస్‌ అవుతానని భావించిన సారా విల్కిన్సన్‌ తనను తానే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో నిశ్చితార్థపు ఉంగరాన్ని కూడా కొనుగోలు చేసింది. సఫోల్క్‌లోని ఫెలిక్స్‌స్టోవ్‌లోని హార్వెస్ట్‌ హౌస్‌లో ఆమె స్నేహితులు, బంధువుల సమక్షంలో ఆమె వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆమె దాదాపు రూ.10 లక్షలు ఖర్చు చేసింది.

పెళ్లి మిస్‌ కావొద్దనే..
వివాహం అనంతరం సారా విల్కిన్సన్‌ మీడియాతో మాట్లాడింది. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఈ రోజు నా పెళ్లి రోజు అయింది. నా పక్కన భాగస్వామి లేకపోవచ్చు కానీ నేను పెళ్లిని మిస్‌ కావొద్దనుకున్నా. అందుకే నా పెళ్లి కోసం ఆదా చేసిన డబ్బులు ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నా. ఈ విషయం బంధువులకు చెప్పాను. అందరూ ఆశ్చర్యపోయారు. అయితే తనకి అందరూ విష్‌ చేశారని, తనకి ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని వెల్లడించింది. పెళ్లి సందర్భంగా తాను 14 ప్రమాణాలను చేసుకున్నానని తెలిపింది సారా..!

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper