
Virupaksha: సాయి ధరమ్ తేజ్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి ఏడాదిన్నర అవుతుంది. ఆయన లాస్ట్ రిలీజ్ రిపబ్లిక్. 2021 అక్టోబర్ లో విడుదలైన ఈ పొలిటికల్ థ్రిల్లర్ పర్లేదు అనిపించుకుంది. రిపబ్లిక్ చిత్ర విడుదలకు ముందు సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురయ్యారు. కోలుకున్న తర్వాత ఆయన చేసిన మొదటి చిత్రం విరూపాక్ష. కెరీర్ బిగినింగ్ నుండి విలక్షణ సబ్జెక్టులు ట్రై చేసిన సాయి ధరమ్ తేజ్ ఈసారి సస్పెన్సు థ్రిల్లర్ ఎంచుకున్నారు. సోషియో ఫాంటసీ అంశాలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు.
ఇటీవల విరూపాక్ష టీజర్ విడుదల చేశారు. చాలా కొత్తగా అనిపించిన ప్రోమో సినిమా మీద ఆసక్తి పెంచింది. విన్నూతమైన కథతో సినిమాను తెరకెక్కించినట్లు అర్థం అవుతుంది. ఇక సాయి ధరమ్ తేజ్ లుక్, యాక్షన్, సక్సెస్ అంశాలతో పాటు విజువల్స్ ఆకట్టుకున్నాయి. విరూపాక్ష సమ్మర్ కానుకగా ఏప్రిల్ 21న విడుదల కానుంది. నేడు ఉగాది పండగను పురస్కరించుకుని సాయి ధరమ్ తేజ్ లుక్ ఒకటి విడుదల చేశారు.
వాహనం మీద కూర్చొని ఉన్న సాయి ధరమ్ మోస్ట్ హ్యాండ్సమ్ గా ఉన్నారు. తన గత చిత్రాలలో ఎవరూ చూపించనంత అందంగా సాయి ధరమ్ తేజ్ ని దర్శకుడు ఈ చిత్రంలో చూపించారని తెలుస్తుంది. విరూపాక్ష చిత్రానికి సుకుమార్ రచయితగా పని చేయడం విశేషం. డెబ్యూ డైరెక్టర్ కార్తీక్ దండు తెరకెక్కిస్తున్నారు. సంయుక్త హీరోయిన్. విరూపాక్ష చిత్రం మీద పరిశ్రమలో అంచనాలు ఉన్నాయి.

అలాగే సాయి ధరమ్ మామయ్య పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ చేస్తున్న విషయం తెలిసిందే. తమిళ హిట్ మూవీ వినోదయ సితం రీమేక్ లో పవన్-సాయి ధరమ్ కలిసి నటిస్తున్నారు. మానవుడు-దానవుడుగా వీరిద్దరూ కనిపించనున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్లో మరోసారి భగవంతుడు పాత్ర చేస్తున్నారు. సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించారు. దేవుడు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఐదారు నెలల్లో ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చే సూచనలు కలవు.