
Ugadi OTT Movies: తెలుగు సంవత్సరానికి నాంది ఉగాది.. ఈరోజు ఎంతో సంతోషంగా గడపాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ప్రకృతి పులకరించే వాతావరణంలో చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగ వస్తుంది. దీంతో వసంత కోకిల రాగాల మధ్య షడ్రుచుల సమ్మేళనంతో నోరూరించే బొబ్బట్ల రుచి చూస్తూ ఆనందంగా గడుపుతారు. 2023 సంవత్సరంలో మార్చి 22న ఉగాది వస్తోంది. ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. రోజంతా సంతోషంగా ఉండి సాయంత్రం ఆలయాల్లో పంచాంగ శ్రవణం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ ప్రేక్షకులకు ఉగాది కానుక ఇవ్వబోతుంది. ఈరోజున థియేటర్లో, ఓటీటీ వేదికగా పలు సినిమాలను రిలీజ్ చేస్తోంది. ఆ సినిమాల వివరాలేంటో ఒకసారి చూద్దాం.
రంగమార్తాండ:
కృష్ణవంశీ డైరెక్షన్లోని రంగమార్తాండ మూవీ ఈనెల 22న థియేటర్లోకి వస్తోంది. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలుగా ఉన్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో సినిమా కోసం ఎదురుచూసి వారి సంఖ్య బాగానే ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
దాస్ కా ధమ్కీ:
తనదైన భిన్న నటనతో ఆకట్టుకుంటున్న విశ్వక్ సేన్ మరో మూవీతో రానున్నారు. అదే దాస్ కా ధమ్కీ. ఈ సినిమాకు విశ్వక్ సేన్ డైరెక్టర్ కావడం విశేషం. ఇందులో ఆయనకు జోడీగా నివేత హేతురాజ్ నటిస్తున్నారు. వీరితో పాటు రావు రమేష్, అజయ్, రోహిణి, అక్షర గౌడ నటించారు. ఈ సినిమాను ఉగాది సందర్భంగా 22న రిలీజ్ చేస్తున్నారు.
గీత సాక్షిగా:
క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చిన లెటేస్ట్ మూవీ ‘గీత సాక్షిగా’. ఆదర్శ్, చిత్రా శుక్లా, శ్రీకాంత్ అయ్యంగార్, రూపేష్ శెట్టి, తదితరులు ఈ సినిమాలో నటించారు. ఈనెల 22న గీత సాక్షిగా థియేటర్లో రిలీజ్ అవుతోంది.
కోస్టి:
కాజల్ తన నటనా శైలిని మార్చారు. ఇన్నాళ్లు అందమైన హీరోయిన్ గా నటించిన ఈమె ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటేడ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్నారు. కాజల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కోస్టి’. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి కల్యాణ్ డైరెక్షన్ చేశారు. ఇందులో కాజల్ తో పాటు యోగి బాబు, కేఎస్ రవికుమార్, ఊర్వశి తదితరులు నటించారు. ‘కోస్టి’ 22న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
కథ వెనుక కథ:
యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన మూవీ కథ వెనుక కథ. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభశ్రీ,, అలీ, సునీల్, జయ ప్రకాశ్, బెనర్జీ తదితర నటులు ఉన్న ఈ సినిమాను 24న థియేటర్లోకి వస్తోంది. కృష్ణ చైతన్య డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు దండమూడి అవనీంద్ర కుమార్ నిర్మాత.
పఠాన్:
షారుఖ్ ఖాన్ చాలా రోజుల తరువాత తెరమీద కనిపించిన చిత్రం ‘పఠాన్’. ఈ సినిమా ఇప్పటికే థియేటర్లో రిలీజై భారీ వసూళ్లను కొల్లగొట్టింది. ఇప్పుడ ఉగాది కానుకగా 22న ఓటీటీ వేదికగా విడుదల అవుతోంది. ఆమెజాన్ ప్రైమ్ లో రిలీజయ్యే ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, భాషల్లోనూ రిలీజ్ కానుంది.

వినరో భాగ్యము విష్ణు కథ:
లవ్, యాక్షన్, దేశ భక్తి నేపథ్యంలో వచ్చిన సినిమా ‘వినరో భాగ్యము విష్ణుకథ’. ఈ సినిమా ఇప్పటికే థియేటర్లో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఉగాది కానుకగా 22న ఆహాలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్టర్.
పంచతంత్రం:
బ్రహ్మనందం ప్రధానపాత్రలో నటించిన మూవీ పంచతంత్రం. ఐదు కథల సమూహంగా ఈ సినిమా తెరకెక్కింది. దీనిని ఈటీవీ విన్ లో 22న రిలీజ్ చేయనున్నారు. ఇందులో కలర్స్ స్వాతి, శివాత్మిక రాజశేఖర్,నరేష్ తదితరులు నటించారు.