
మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ మనం జీవితంలో ఉన్నత విజయాలు అందుకోవడానికి సహాయపడుతుంది. అయితే కొందరిలో మాత్రం అరుదైన టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ గురించి విన్నా, చూసినా ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. తాజాగా ఇద్దరు యువకులు ఎండలో నీటితో వేసిన ఆర్ట్ కు సంబంధించిన ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఎండలో నీటితో ఆర్ట్ వేయడం అసాధ్యమైనా ఇద్దరు యువకులు దానిని సుసాధ్యం చేశారు.
బాస్కెట్ బాల్ కోర్టులో ఒక వ్యక్తి ఆడుతున్నట్టుగా రోడ్డుపై నీటితో వేసిన అరుదైన ప్రతిభకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు యువకుల టాలెంట్ ను చూసి నెటిజన్లు వాళ్లను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మాజీ బాస్కెట్ బాల్ ఆటగాడు రెక్స్ చాంప్‌మాన్ 22 సెకండ్ల నిడివి గల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. రెక్స్ పోస్ట్ లో గతంలో తాను ఇలాంటి వీడియోను చూడలేదని… ఇది నిజంగా అద్భుతం అని పేర్కొన్నాడు.
ఇద్దరు యువకులు 95 డిగ్రీల ఎండలో ఐదు రోజుల పాటు శ్రమించి ఈ ఆర్ట్ వేశారు. నెటిజన్లు యువకులు పడిన కష్టాన్ని చూసి మనుషుల్లో కూడా సాధారణమైన ప్రతిభ ఉంటుందని ఈ వీడియో చూస్తే అర్థమవుతుందని కామెంట్లు చేస్తున్నారు. ఒక యువకుడు పడుకుని ఉండగా అతని చుట్టూ లే అవుట్ గీసి బాస్కెట్ బాల్ ఆడుతున్న రీతిలో వేసిన ఆర్ట్ అద్భుతం అని ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రెక్స్ పోస్ట్ చేసిన ట్వీట్ కు మిలియన్ వ్యూస్ వచ్చాయి.
https://twitter.com/RexChapman/status/1293385698582593537