Karimnagar Missing Case: కరీంనగర్‌లో బాలిక అదృశ్యం మిస్టరీని పోలీసులు ఛేదించారు. బుధవారం బైపాస్ రోడ్డులో బస్సు దిగిన బాలిక తర్వాత కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ రూరల్ పోలీసుల ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. రెండు రోజుల వ్యవధిలో బాలికను గుర్తించారు. హైదరాబాద్ బస్టాండ్‌లో బాలికను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఏం జరిగిందంటే..
కరీంనగర్ జిల్లాలో కలకలం చేపిన 13 ఏళ్ల బాలిక వశిష్ట రెండు రోజుల క్రితం నగరం శివారులోని బైపాస్‌లో అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో అలర్ట్ అయిన కరీంనగర్ పోలీసులు చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. హెదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో కనుగొన్నారు. అక్కడ వశిష్టను అక్కున చేర్చుకున్నారు. చిన్నారి భయంతో ఉండడంతో తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్తామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వశిష్ట అమ్మ కావాలని ఏడవడం మొదలు పెట్టింది. దీంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తీసుకు వచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో వశిష్ట మిస్సింగ్ కథ సుఖాంతమైంది.
చదువుకోవడం ఇష్టం లేక..
అయితే కరీంనగర్ ౖ»ñ పాస్‌లో మిస్ అయిన వశిష్ట అసలు హైదరాబాద్‌కు ఎందుకు వెళ్లింది అనేది ప్రశ్నార్థకంగా మారింది. చిన్నారిని ఎవరైనా తీసుకెళ్లారా.. లేక తెలియకుండానే ఆమె బస్సు ఎక్కి వెళ్లిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం మిస్ అయిన వశిష్ట రెండు రోజులు ఎక్కడ ఉంది అన్నది తెలియాల్సి ఉంది. రెండు రోజులు ఎలా గడిపింది అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వశిష్ట భయపడుతుండడంతో ఏమీ అడగలేకపోయారు. తర్వాత నిదానంగా ఆరా తీశారు. ఆమె పాఠశాలకు వెళ్లకుండా హైదరాబాద్ వెళ్లడానికి వశిష్ట చెప్పిన కారణం విని షాక్ అయ్యారు. చదువుకోవడం ఇష్టంలేక, ప్రీ బస్సు నచ్చడంతో హైదరాబాద్‌కు వెళ్లినట్లు వశిష్ట తెలిపింది. ఈమేరకు చిన్నారి హైదరాబాద్ బస్టాండ్‌లో తిరుగుతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈమేరకు ఆ దృశ్యాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తల్లిదండ్రులు పిల్లల మనసు ఎరిగి నడుచుకోవాలని, తరచూ గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు.
స్కూలుకు పోవడం ఇష్టం లేక ఫ్రీగా బస్సులో తిరిగిన కరీంనగర్ బాలిక
మిస్సింగ్ కేసు ఫిర్యాదుతో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. pic.twitter.com/HGGvOUoMP4
— Telugu Scribe (@TeluguScribe) December 30, 2023