Rakhi Pournami Gifts : రాఖీ పండుగ అంటే అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి గుర్తుగా జరుపుకుంటారు. ఎన్ని ఏళ్లు అయిన బంధం అలాగే మంచిగా ఉండాలని సోదరుడి చేతికి రాఖీ కట్టి గిఫ్ట్‌లు ఇస్తారు. ఎంత దూరానా ఉన్న ఏదో విధంగా రాఖీలు పంపించుకుంటారు. అయితే రాఖీ పండుగను ఎప్పటిలా కాదు. ఈసారి కొత్తగా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మీ సోదరికి మీరు ఎల్లప్పుడూ గుర్తుంటారు. అలాగే వాళ్లకి మీరు ఆర్ధికంగా భరోసా ఇచ్చినట్లు ఉంటుంది. మరి మీ సోదరికి కొత్తగా ట్రై చేసి ఎలాంటి గిఫ్ట్‌లు ఇవ్వాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి
మీ సోదరి భవిష్యత్తు కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టండి. ఇలా మీ సోదరికి గిఫ్ట్ ఇవ్వడం వల్ల తనకి ఆర్థికంగా బాగుంటుంది. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చిన వాళ్లకి ఆ బాండ్ సాయపడుతుంది.
ప్రభుత్వ సేవింగ్స్
ప్రభుత్వం ఇప్పుడు మహిళల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. అయితే అందులో ప్రత్యేకంగా ఉన్న మహిళా సమ్మాన్ సేవింగ్ పథకంలో మీ సోదరి కోసం పొదుపు చేయండి. సాధారణంగా బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి గిఫ్ట్‌లను మీ సోదరికి ఇవ్వడం వల్ల ఆనందంగా ఉంటుంది. భవిష్యత్తు కోసం ముందు జాగ్రత్తగా ఎంతగానో ఆలోచించారని సంబరపడిపోతారు.
స్టాక్స్ కొనండి
దుస్తులు, వాచ్‌లు అలా కాకుండా మీకు వీలైనంత వరకు స్టాక్స్ కొనండి. కంపెనీ షేర్లు పెరిగితే వాళ్ల సంపద పెరుగుతుంది. కాబట్టి మీకు తోచినంత డబ్బుతో స్టాక్స్ కొనండి.
బంగారం, వెండి
చాలామంది ఎక్కువగా బంగారం, వెండి సామానులు గిఫ్ట్‌గా ఇస్తుంటారు. వీటిని ఇచ్చిన వాళ్లు అలాగే ఉంచుకుంటారు. కానీ ఏమీ వాడరు. అదే డిజిటల్ బంగారం ఇచ్చారనుకోండి. దానివల్ల ఏటా కొంత లాభం వస్తుంది. కాబట్టి ఫిజికల్ బంగారం కంటే డిజిటల్ గోల్డ్ కొనివ్వడం మంచిది.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు
సోదరికి బహుమతులు కొత్తగా ఇవ్వాలనుకునే వాటిలో ఇది కూడా ఒకటి. మీరు వాళ్లకి ఇచ్చే డబ్బులు ఫిక్స్‌డ్ చేస్తే చాలా మంచిది. దీనివల్ల వడ్డీ కలుస్తుంది. వాళ్లకి ఏదో విధంగా ఉపయోగపడుతుంది.
బీమా
సోదరిల ఆరోగ్యానికి, భవిష్యత్‌కు భరోసా కల్పించడం కోసం టర్మ్ ఇన్సూరెన్స్‌తో పాటు ఆరోగ్య బీమా పాలసీ కూడా తీసుకోండి. ఇలాంటివి ఉండటం వల్ల భవిష్యత్తులో కష్టసమయాల్లో సాయపడుతుంది.