ProjectK : ప్రభాస్ పేరు చెప్పి వందల కోట్ల ఖర్చుతో ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నారు. అవుట్ ఫుట్ ఆ స్థాయిలో ఉండటం లేదు. ఒక్క సాహో మినహాయిస్తే రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాల బడ్జెట్ కి నిర్మాణ విలువలకు సింక్ కుదర్లేదు. ముఖ్యంగా ఆదిపురుష్ దారుణమైన ట్రోలింగ్ కి గురైంది. రూ. 600 కోట్ల రూపాయల ఖర్చు చేసిన కార్టూన్ మూవీ తీశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అసంపూర్తిగా ఉన్న గ్రాఫిక్స్ తో దర్శకుడు ఓం రౌత్ విమర్శలపాలయ్యాడు. ప్రభాస్ లాంటి హీరోతో ఇలా నాసిరకం చిత్రం చేస్తావా? అని మండిపడ్డారు.
Rey Asalu Em Chesthunnaru ra Maa Darling Ni 🥹🥹🥲🥲💔#Prabhas #WhatisProjectK #ProjectK #NagAshwin #DeepikaPadukone #PrabhasEra pic.twitter.com/jNitCMkRl5
— Addicted To Memes (@Addictedtomemez) July 19, 2023
ఓం రౌత్ కి నాగ అశ్విన్ ఏమాత్రం తీసిపోడనే వాదన మొదలైంది. నేడు విడుదలైన ప్రాజెక్ట్ కే మూవీ ఫస్ట్ లుక్ అట్టర్ ప్లాప్. మహానటి మూవీ చూసి నాగ అశ్విన్ పై ప్రభాస్ ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఒక్కో అప్డేట్ తో అంచనాలు పెంచుతుంటే ఇండియన్ కామెరూన్, స్పీల్బర్గ్ అనుకున్నారు. తీరా ప్రాజెక్ట్ కే ఫస్ట్ లూకి చూసి కంగుతిన్నారు. ఐరన్ మాన్ సూట్ ని తలపిస్తున్న బాడీకి ప్రభాస్ తలను అంటించినట్లు ఉంది ఆ లుక్. పక్కా మార్ఫింగ్ ఫోటోని తలపించింది.
#prabhas firstlook#ProjectK #NagAshwin pic.twitter.com/eDA020ph57
— Don Lee 마동석 (@don_lee128) July 19, 2023
ఫస్ట్ లుక్ చూసి ఫ్యాన్స్, సినిమా లవర్స్ చాలా సేపు షాక్ లో ఉన్నారు. ఇది ఒరిజినల్ పోస్టరా లేక ఫ్రాంక్ చేశారా? అనే సందేహాలు కలిగాయి. అధికారిక అకౌంట్ నుండి కావడంతో నమ్మక తప్పలేదు. నేడు ప్రాజెక్ట్ కే యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ కంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ వంద రెట్లు బెటర్ అంటున్నారు. సోషల్ మీడియాలో ప్రాజెక్ట్ కే లుక్ ఓ రేంజ్ లో ట్రోల్స్ కి గురవుతుంది. ఆదిపురుష్ సీన్ రిపీట్, అసలు ప్రభాస్ తో ఎలాంటి సినిమాలు తీస్తున్నార్రా? మీరు అనే సందేహాలు మొదలయ్యాయి.
ప్రతిసారి ఇదే జరుగుతుంటే ప్రభాస్ మీద సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం జాగ్రత్తలు తీసుకోవడం లేదా? తాను నటించే సినిమాల మీద ఆయనకు నజర్ ఉంటుందా లేదా? అంటున్నారు. ఆదిపురుష్ పోస్టర్స్, టీజర్స్ ఇలానే మొదటి నుండి ట్రోల్స్ కి గురయ్యాయి. అది సినిమా రిజల్ట్ మీద దారుణమైన ప్రభావం చూపింది. ప్రాజెక్ట్ కే మూవీ సైతం ఫస్ట్ ఇంప్రెషన్ సాధించలేకపోయింది. పైగా పూర్తి నెగిటివిటీ మూటగట్టుకుంది. రెండు రోజుల్లో రానున్న టీజర్ తో ప్రాజెక్ట్ కే భవిష్యత్ తేలిపోనుంది. టీజర్ అటూ ఇటూ అయితే సినిమా మెరుగైన బిజినెస్ చేయడం కష్టమే…
https://twitter.com/NTRALAELA/status/1681670886548549632?s=20