
Troll Of The Day: చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సింగపూర్ రియల్ ఎస్టేట్ కంపెనీల గ్రాఫిక్స్ తోనే పొద్దుపుచ్చారు.. ఏదో నామమాత్రంగా సచివాలయం కట్టి అందులోనూ కోట్లు దండుకున్నారు. ఇక ప్రైవేట్ సంస్థల కైతే భారీగా భూ సంతర్పణ చేశారు.. కానీ ఇదే ఆసక్తి రాజధాని నిర్మాణంలో చూపించలేకపోయారు. దీనిని ప్రజల నుంచి డైవర్షన్ చేసేందుకు కేంద్రంపై యుద్ధం అంటూ రకరకాల జిమ్మిక్కులు చేశారు.. దీంతో జనం 23 దగ్గర బ్రేకులు వేశారు.. ఇక అప్పటినుంచి పచ్చ మీడియాకు శోకాలు, పెడ బొబ్బలు.
చంద్రబాబు తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ కూడా ఏమంత గొప్పగా పాలించడం లేదు.. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం. దానికి ఎవడూ ఏం చేయలేడు. అమరావతి పేరుతో ఒక సామాజిక వర్గానికి భారీగా భూములు కేటాయించాలని ఆరోపిస్తూ మూడు రాజధానులకు జగన్ తెరలేపాడు. దీంతో కడుపు మండిన పచ్చ మీడియా, పచ్చ గ్యాంగ్ రకరకాల కుయుక్తులు పన్నుతున్నాయి.. ఆ మధ్య రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు ఉద్యమం చేశారు. ఇప్పుడు ఆ ఉద్యమం వేడి కూడా చల్లారిపోయింది.. మరోవైపు న్యాయస్థానాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నాయి. అయినప్పటికీ జగన్ వెనకడుగు వేయడం లేదు.. మరోవైపు ఇటీవల ఢిల్లీలో తాను విశాఖపట్నం షిఫ్ట్ అవుతున్నానని సంకేతాలు ఇచ్చారు. అంటే విశాఖపట్నం క్యాపిటల్ రాజధాని అవుతుందని జగన్ చెప్పకనే చెప్పారు.. దీంతో అప్పటినుంచి ఇప్పటిదాకా పచ్చ మీడియా రంకెలు వేస్తూనే ఉంది.

ఇక తాజాగా ఓ న్యూస్ ఛానల్ లో ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పులకు సంబంధించి ఒక డిబేట్ నిర్వహించగా… ఆ న్యూస్ ప్రజెంటర్ ను డిబేట్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఓ ఆట ఆడుకున్నాడు.. చట్టంలో నిబంధనలను వివరించడంతో ఆ న్యూస్ ప్రెసెంటర్ కు మతి పోయినంత పనైంది.. అలా అతను మాట్లాడుతుంటే బొమ్మలాగా చూస్తుండిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.