
Trivikram Wife Soujanya: టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే మన అందరికీ గుర్తుకు వచ్చే పేర్లు పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్.ఈ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం అందరికీ ఎంతో ఆదర్శం. జల్సా సినిమా తో పరిచయమైనా వీళ్లిద్దరి స్నేహం, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలన్నీ కూడా త్రివిక్రమ్ ఆద్వర్యం లో జరుగుతున్నవే. రాజకీయ కార్యకలాపాలలో క్షణం తీరిక లేకుండా గడిపే పవన్ కళ్యాణ్ కి ఒక సినిమా సబ్జెక్టు ని జడ్జి చేసే సమయం లేకుండా పోతుంది.
అందుకే ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ డైరెక్టర్ స్థానం లో ఉన్నప్పటికీ కూడా త్రివిక్రమ్ ఆ బాధ్యతని తన భుజాన వేసుకున్నాడు.కాంబినేషన్స్ సెట్ చెయ్యడం దగ్గర నుండి, పవన్ కళ్యాణ్ సినిమాలకు స్క్రిప్ట్ అందించడం వరకు అన్నీ ఆయనే చూసుకుంటున్నాడు. ఇలాంటి స్నేహితుడిని బహుశా మనం నిజ జీవితం లో కూడా చూసి ఉండము.

ఇది ఇలా ఉండగా రీసెంట్ గా త్రివిక్రమ్ సతీమణి సౌజన్య శ్రీనివాస్ ఒక ప్రముఖ దిన పత్రికకి ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చింది.ఈ ఇంటర్వ్యూ లో ఆమె పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ మధ్య ఉన్న స్నేహం గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి వచ్చినప్పుడు త్రివిక్రమ్ గారితో బోలెడన్ని కబుర్లు చెప్పుకుంటూ ఈ ప్రపంచాన్నే మర్చిపోతారు. తత్వ శాస్త్రం, మరియు పురాణాల గురించే వీళ్లిద్దరు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. తన సొంత పుస్తకాలను ఎవరితో షేర్ చేసుకోని త్రివిక్రమ్ శ్రీనివాస్, కళ్యాణ్ గారికి మాత్రం ఇస్తుంటారు.వాళ్ళిద్దరి మధ్య తరుచు పుస్తకాలూ ఎక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి.పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి వచ్చినప్పుడు ఏమాత్రం సిగ్గుపడదు,సొంత కుటుంబ మనిషి లాగానే కలిసిపోతాడు. నేను తయారు చేసే ఉప్మా అంటే ఆయనకీ ఎంతో ఇష్టం,ఉదయం వచినప్పుడుల్లా బ్రేక్ ఫాస్ట్ కి అడిగిమరీ చేయించుకొని తింటాడు’ అంటూ ఈ సందర్భంగా సౌజన్య చెప్పుకొచ్చింది.