Homeఎంటర్టైన్మెంట్Mrithyunjay first day collections: శ్రీ విష్ణు 'మృత్యుంజయ్' చిత్రానికి డీసెంట్ ఓపెనింగ్స్.. మొదటి రోజు...

Mrithyunjay first day collections: శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’ చిత్రానికి డీసెంట్ ఓపెనింగ్స్.. మొదటి రోజు వచ్చిన గ్రాస్ ఎంతంటే!

Mrithyunjay first day collections: శ్రీ విష్ణు(Sree Vishnu) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మృత్యుంజయ్'(Mrityunjay Movie) నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలై మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈమధ్య కాలంలో వరుసగా కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీవిష్ణు, కాస్త రూట్ మారుస్తూ ఈసారి క్రైమ్ థ్రిల్లర్ జానర్ తో మన ముందుకు వచ్చాడు. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా, విడుదల తర్వాత ఇంకా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. గత వారం విడుదలైన శ్రీ విష్ణు ‘విష్ణు విన్యాసం ‘ చిత్రం కంటే ఈ సినిమానే బాగుందని అంటున్నారు చూసిన ప్రతీ ఒక్కరు. ఆసక్తికరమైన పాయింట్ తో , క్రిస్పీ రన్ టైం తో, ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా చక్కగా ఈ చిత్రాన్ని తీశారంటూ మెచ్చుకుంటున్నారు ఆడియన్స్ .

టాక్ కారణంగా ఓపెనింగ్స్ కూడా చాలా డీసెంట్ గా నమోదు అవుతున్నాయి. నూన్ షోస్ నుండే ఈ చిత్రం బాగా పికప్ అయ్యింది. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు 8 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. నేడు విడుదలైన అన్ని సినిమాలకంటే ఈ చిత్రానికే మంచి పాజిటివ్ టాక్ ఉండడం తో , ఫస్ట్ షోస్ నుండి వసూళ్లు ఇంకా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే ఈ చిత్రానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఆఫ్ లైన్ టికెట్ అమ్మకాలు బట్టీ ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయట. మరి ఈ చిత్రం లాంగ్ రన్ లో గత నెల విడుదలైన ‘విష్ణు విన్యాసం ‘ చిత్రం కలెక్షన్స్ ని దాటేస్తుందా లేదా అనేది చూడాలి.

శ్రీవిష్ణు విలక్షణమైన నటుడు. ఆయన ఎలాంటి పాత్ర ని అయినా అలవోకగా చేయగలడు. కానీ ఈమధ్య కాలంలో ఆయనలోని కామెడీ టైమింగ్, అతనిలోని విలక్షణమైన నటుడిని డామినేట్ చేస్తూ వచ్చింది. ఈ చిత్రం తో శ్రీవిష్ణు ఆ ఛత్రం నుండి బయటకు వచ్చాడనే చెప్పొచ్చు. రేపు , ఎల్లుండి కూడా ఈ చిత్రానికి డీసెంట్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం కారణంగా గత వారం విడుదలైన శ్రీ విష్ణు ‘విష్ణు విన్యాసాలు ‘ మూవీ బుక్ మై షో లో ట్రెండింగ్ నుండి బయటకు వెళ్ళిపోయింది. మరి అంతలా ప్రభావితం చేసిన మృత్యుంజయ్ చిత్రం ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version