
Trivikram- Mahesh Babu: మహేష్ బాబు వారానికో విదేశీ టూర్ కి వెళుతుంటే, దర్శకుడు త్రివిక్రమ్ ఏమో ఇతర డైరెక్టర్స్ కి స్క్రిప్ట్స్ అందిస్తూ బిజీ. అసలు ఎస్ఎస్ఎంబి 28 షూటింగ్ ఎంత వరకు వచ్చిందో? ఎప్పుడు రిలీజ్ చేస్తారో? క్లారిటీ లేదు. ఫస్ట్ షెడ్యూల్ అర్ధాంతరంగా ఆగిపోయింది. షూటింగ్ మొదలెట్టాక స్క్రిప్ట్ లో మార్పులు చేశారన్న ప్రచారం జరిగింది. మళ్ళీ ఫ్రెష్ గా మొదలుపెడుతున్నారన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. మహేష్-త్రివిక్రమ్ మూవీ షూటింగ్ పూర్తి స్థాయిలో మొదలైన దాఖలాలు కనిపించలేదు . పట్టుమని పది రోజులు నిరవధికంగా షూటింగ్ చేసిన పాపాన పోలేదు.
కాగా ఎస్ఎస్ఎంబి 28 షూట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే… 95 శాతం షూటింగ్ ఏప్రిల్ నెల కల్లా పూర్తి చేస్తారట. మిగిలిన ఒక పాట, ఫైట్ మరో నెలలో పూర్తి చేసి ఆగష్టులో విడుదల చేస్తారట. అసలు త్రివిక్రమ్ మహేష్ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు జరిపారు? ఏప్రిల్ కల్లా చిత్రీకరణ పూర్తి కావడమేంటి? అంటున్నారు. అలాగే ఈ చిత్రంలో కేవలం మూడు ఫైట్స్ మాత్రమే ఉంటాయట. దీంతో మహేష్ తో త్రివిక్రమ్ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడా? ఏందీ అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాచారం మహేష్ మూవీ మీద నెగిటివ్ ఒపీనియన్స్ డెవలప్ చేస్తుంది.
ఈ మధ్య టైర్ టు హీరోలు కూడా ఒక్కో సినిమా షూటింగ్ ఏడాది చేస్తున్నారు. త్రివిక్రమ్ మాత్రం మహేష్ మూవీ ఆరు నెలల్లో చుట్టేస్తున్నారట. ఈ మతలబు ఏంటో అంతుబట్టడం లేదు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. పది కోట్ల రూపాయల ఖర్చుతో లగ్జరీ హౌస్ సెట్ వేశారట. అక్కడే కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. తాజా షెడ్యూల్ నందు హీరోయిన్స్ పూజా హెగ్డే, శ్రీలీల కూడా పాల్గొంటున్నారట. ఇక ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక రోల్స్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.

సూర్యదేవర నాగవంశీ ఈ చిత్ర నిర్మాతగా ఉన్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. దాదాపు 13 ఏళ్ల అనంతరం మహేష్-త్రివిక్రమ్ కాంబోలో మూవీ వస్తుంది. గతంలో అతడు, ఖలేజా చిత్రాలు చేశారు. ఎస్ఎస్ఎంబి 28 వీరికి హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. మరోవైపు మహేష్ దర్శకుడు రాజమౌళి చిత్రం కోసం సిద్ధం అవుతున్నారు. ఇటీవల ఆయన జిమ్ లో కండలు పెంచుతున్న ఫోటో షేర్ చేశారు. రాజమౌళి చిత్రంలో లుక్ కోసం మహేష్ కసరత్తులు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.