
Mahesh Babu: అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో అమితాసక్తితో ఎదురు చూసే సినిమాలు కొన్ని ఉంటాయి.ఆ సినిమాలకు షూటింగ్ దశ నుండే అంచనాలు కనీవినీ ఎరుగని రేంజ్ లో ఏర్పడుతాయి.అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి మహేష్ – త్రివిక్రమ్ కలయిక.గతం లో వీళ్లిద్దరి కలయిక లో వచ్చిన అతడు మరియు ఖలేజా వంటి చిత్రాలు కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు కానీ, టీవీలలో టెలికాస్ట్ అయ్యినప్పుడు మాత్రం కల్ట్ క్లాసిక్ స్టేటస్ ని అందుకున్నాయి.
అందుకే ప్రస్తుతం వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న మూడవ సినిమా పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు.ఈమధ్యనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ చిత్రానికి అప్పుడే బిజినెస్ ఆఫర్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో వస్తున్నాయి.ఒక ప్రాంతీయ సినిమాకి ఈ రేంజ్ ఆఫర్స్ వస్తున్నాయంటే ఈ కాంబినేషన్ పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త, ఇప్పుడు అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.అదేమిటంటే ఈ సినిమా మొత్తం కుటుంబ నేపథ్యం లోనే సాగుతుందట.సినిమాలో సందర్భానుసారం గా కేవలం రెండు ఫైట్స్ మాత్రమే ఉంటాయట.అవి కూడా చాలా చిన్న ఫైట్స్ అని తెలుస్తుంది.గత కొద్దీ సంవత్సరాల నుండి మహేష్ బాబు ఇలాంటి సినిమాలే తీస్తున్నాడు.ఈ సినిమాతో సరికొత్త గా చూడొచ్చు, పోకిరి రేంజ్ మాస్ ని ఆశించవచ్చు అని ఆశపడ్డ అభిమానులకు మళ్ళీ నిరాశే ఎదురు అవ్వక తప్పదని తెలుస్తుంది.

హైదరాబాద్ పరిసర ప్రాంతం లో ఒక ఇంటి సెట్ వేశారు.అక్కడే షూటింగ్ మొత్తం కానిచ్చేస్తున్నారు, శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెలలోనే షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకోబోతుందట.ఆగస్టు 11 వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.మరి అభిమానులు భయపడుతున్నట్టే ఈ సినిమా ఉంటుందా,లేదా త్రివిక్రమ్ ఏమైనా మ్యాజిక్ చేస్తాడా అనేది చూడాలి.