https://oktelugu.com/

హాట్ టాపిక్:ఆ మూవీలో నటించే జంటలకు పెళ్లి అవుతుందా?

హీరోయిన్ త్రిష.. హీరో శింబు ప్రేమ.. పెళ్లిపై పుకార్లు కొత్తేమీ కాదు. వెటరన్ బ్యూటీకి కిందటేడాది ఓ పారిశ్రామిక వేత్తతో నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లిపీఠలెక్కక ముందే వారిద్దరు పెళ్లిని రద్దును చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి త్రిష వరుసగా సినిమాలు చేస్తూ మళ్లీ బీజీగా మారింది. తాజాగా మరోసారి త్రిష పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. Also Read: వైరల్ ఫొటో: ‘మెగా’ పార్టీలో మహేష్-ప్రభాస్..! హీరో శింబు ప్రేమ వ్యవహారాలు కోలీవుడ్ ఇండస్ట్రీకి కొత్తేమీకాదు. తనతో నటించిన హీరోయిన్స్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 16, 2020 / 01:04 PM IST
    Follow us on

    హీరోయిన్ త్రిష.. హీరో శింబు ప్రేమ.. పెళ్లిపై పుకార్లు కొత్తేమీ కాదు. వెటరన్ బ్యూటీకి కిందటేడాది ఓ పారిశ్రామిక వేత్తతో నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లిపీఠలెక్కక ముందే వారిద్దరు పెళ్లిని రద్దును చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి త్రిష వరుసగా సినిమాలు చేస్తూ మళ్లీ బీజీగా మారింది. తాజాగా మరోసారి త్రిష పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

    Also Read: వైరల్ ఫొటో: ‘మెగా’ పార్టీలో మహేష్-ప్రభాస్..!

    హీరో శింబు ప్రేమ వ్యవహారాలు కోలీవుడ్ ఇండస్ట్రీకి కొత్తేమీకాదు. తనతో నటించిన హీరోయిన్స్ తో శింబు అఫేర్స్ పెట్టుకుంటాడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. స్టార్ హీరోయిన్లు నయనతార.. హన్సికలతో శింబు ప్రేమాయణం నడిపాడు. అయితే పెళ్లికి మాత్రం ముఖం చాటేశాడు. అప్పట్లో నయనతార-శింబు ప్రేమాయణం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది.

    ప్రస్తుతం త్రిష-శింబులు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ కోలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. శింబు-త్రిషలు చాలా సినిమాల్లో కలిసి నటించారు. వీరిద్దరు కలిసి ఇటీవల ఓ షార్ట్ ఫిలీం కలిసి నటించారు. దీంతో వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే గుసగుసలు విన్పిస్తున్నాయి.

    గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ఏం మాయ చేశావే’ ప్రేమకథ ఎనిమిదేళ్ల క్రితం సినిమాగా తెరకెక్కింది. ఈ మూవీ తెలుగు వర్షన్లో సమంత-నాగచైతన్య నటించారు. ఈ కథ ఎండింగులో హీరోహీరోయిన్లు పెళ్లి చేసుకొని ఒకటవుతారు. ఈ ప్రేమకథ మాదిరిగానే సమంత-నాగచైతన్య నిజజీవితంలోనూ రెండేళ్లు ప్రేమించుకొని ఒకటయ్యారు.

    Also Read: కొత్త లుక్కులో ఆకట్టుకుంటున్న ‘కొమురంభీం’ ఎన్టీఆర్.!

    ‘ఏం మాయ చేశావే’ తమిళ వర్షన్లో త్రిష-శింబు నటించారు. తెలుగు కథలో హీరోయిన్లు ఒకటవుతారు.. అయితే తమిళ వర్షన్లో మాత్రం హీరోయిన్ మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. దీంతో త్రిష-శింబులు నిజజీవితంలో ఒక్కటి అవుతారా? లేదంటే ఈ సినిమా సెంటిమెంట్ మాదిరిగానే త్రిష మరొకరిని పెళ్లి చేసుకుంటుందా? లేదా శింబును పెళ్లి చేసుకొని అందరికీ షాకిస్తుందా? అనేది మాత్రం ఆసక్తిని రేపుతోంది.