Trees On Dividers: ప్రధాన రోడ్లపై డివైడర్ల పై చెట్లను పెంచడం చూస్తుంటాం. రోజురోజుకు పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో ప్రత్యేకంగా చెట్లను పెంచాలని కొన్ని ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. అందువల్ల రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పై పచ్చని చెట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా సిటీల్లోకొచ్చేసరికి వీటిపై పచ్చని గడ్డిని పెంచుతున్నారు. అయితే ఈ డివైడర్లపై ఎక్కువగా గన్నేరు చెట్లను చూస్తుంటాం. ఎర్రటి పూలు కలిగిన ఈ చెట్లను మాత్రమే ఎందుకు పెంచుతారు? అని చాలా మందికి సందేహం వచ్చ ఉంటుంది. కేవలం గన్నేరు చెట్లను పెంచడంలో ఓ కారణం ఉంది. అదేంటంటే?
ప్రస్తుత రోజుల్లో వాహనాలు ఎక్కువ కావడంతో పాటు ఫ్యాక్టరీల నుంచి వెలువడే కాలుష్యంతో పర్యావరణం దెబ్బతింటోంది. ఢిల్లీలో వాతావరణం పూర్తిగా కాలుష్యం దెబ్బతినడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని తగ్గించడానికి అక్కడి వాహనాలను ఎక్కువగా తిరగనివ్వడం లేదు. అయితే సౌత్ లో అంతటి తీవ్రత లేకున్నా ముందు జాగ్రత్తగా కొన్ని ప్రభుత్వాలు అప్రమత్తమై చెట్లను పెంచడం మొదలు పెట్టాయి.
రోడ్డు పక్కన, డివైడర్ల మధ్యలో కొన్ని ప్రత్యేక చెట్లను పెంచుతున్నారు. వీటిలో ఎక్కువగా గన్నేరు చెట్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎర్రటి పూలు కలిగి.. పొడవాటి ఆకులు ఉంటాయి. సాధారణంగానే చెట్లుు కార్బన్ యాక్సైడ్ ను తీసుకొని ఆక్సిజన్ వదిలేస్తుంటాయి. అయితే గన్నేరు చెట్లలో మాత్రం ఎంతటి తీవ్రత కాలుష్యాన్నైనా గ్రహిస్తుందట. అలాగే రోడ్డుపై వెళ్లే వాహనాలు విషపూరితమైన పొగను వదిలేస్తుంటాయి. వీటిని ఇవి తొందరగా గ్రహిస్తాయి.
గన్నేరు చెట్లు పెరగడానికి పెద్దగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు కాస్త పెరిగిన తరువాత అవి త్వరగా పెద్దగా మారుతాయి. అంతేకాకుండా వీటిని మేకలు, గొర్లు తినలేవు. దీంతో ఈ చెట్ల ఆకులు ఎప్పుడు గుబురుగా ఉంటాయి. పైగా వీటి నిర్వహణకు పెద్దగా ఖర్చు ఉండదు. అందువల్ల మిగతా చెట్ల కంటే గన్నేరు చెట్లను పెంచడానికి ఎక్కుగా ఆసక్తి చూపుతూ ఉంటారు. వీటిని ఇళ్లల్లోనూ పెంచుకోవడం వల్ల ఆ పరిసర ప్రాంతాల వారు ఆరోగ్యంగా ఉంటారని అంటుంటారు