
Tollywood Director: ఆన్ స్క్రీన్ లో హీరోయిన్ హీరోకి మాత్రమే పడుతుంది. ఆఫ్ స్క్రీన్ లో ఆ వ్యక్తి ఎవరైనా నచ్చితే మనసిస్తుంది. నిర్మాతలు, దర్శకులను పెళ్లి చేసుకున్న, ప్రేమించి ఎఫైర్స్ నడిపిన హీరోయిన్స్ ఎందరో ఉన్నారు. అంతెందుకు ఆనాటి శ్రీదేవి ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ని పెళ్లి చేసుకుంది. ఈనాటి రకుల్ ప్రీత్ యంగ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ తన ప్రేమికుడంటూ పరిచయం చేసింది. అతనితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంది. అందుకే ప్రేమ ఎప్పుడు ఎవరిపై పుడుతుందో చెప్పలేం అంటారు.
తాజాగా టాలీవుడ్ లో ఒక ప్రేమకథ హాట్ టాపిక్ అయ్యింది. సినిమా వర్గాల్లో చర్చకు దారితీసింది.ఓ యువ ప్రొడ్యూసర్ కుర్ర హీరోయిన్ ని లైన్లో పెట్టాడట. ఆమె మనసు దోచేశాడట. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారట. ఈ నిర్మాత ఫ్యామిలీ రెండు దశాబ్దాలుగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉంది. నిర్మాతలుగా ఎదగాలనే క్రమంలో బ్యానర్ స్థాపించి సినిమాలు చేస్తున్నారు. ప్రాజెక్ట్ చిన్నదైనా పెద్దదైనా ఈ నిర్మాణ సంస్థ ఆచితూచి సినిమాలు చేస్తుంది. ఇటీవల ఓ పెద్ద ప్రాజెక్ట్ ప్రకటించారు.
ఇక ఆ యంగ్ హీరోయిన్ విషయానికి వస్తే చేసింది తక్కువ చిత్రాలే. ఇటీవల పరిశ్రమలో అడుగు పెట్టింది. అయితే వంద శాతం సక్సెస్ రేట్ తో దూసుకుపోతుంది. టాలీవుడ్ మేకర్స్ ఆమె వెంటపడుతున్నారు. స్టార్ హీరోయిన్ కావడం ఖాయమంటూ ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేరీర్లో ఎదుగుతున్న క్రమంలో ప్రేమలో పడిదంటూ చెవులు కొరుక్కుంటున్నారు. ఇండస్ట్రీ జనాలకు వీరి వ్యవహారం మీద అనుమానం వచ్చిందట. బయటకు చెప్పకున్నా తమలో తాము పెద్ద ఎత్తున చర్చించుకున్నారట.

ఇక ఈ యంగ్ హీరోయిన్ షూటింగ్ కోసం ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఆ నిర్మాతను తప్పక కలుస్తుందట. ఇద్దరూ డిన్నర్ నైట్స్, ప్రైవేట్ పార్టీలు ఎంజాయ్ చేస్తున్నారట. చెప్పాలంటే ఒకరిని మరొకరు వదిలి ఉండలేనంతగా మనసులు ఇచ్చిపుచ్చుకున్నారట. ఈ క్రమంలో త్వరలో అధికారికంగా వీరి ఎఫైర్ బయటపడే సూచనలు కలవంటున్నారు. అదే సమయంలో భవిష్యత్ ఉన్న హీరోయిన్ మనసు మాట విని పాడైపోతుంది. కెరీర్ నాశనం చేసుకుంటుందని కొందరు వాపోతున్నారట.
దీంతో వీరి వ్యవహారం ఎంత దూరం వెళుతుంది. ఎలా ముగుస్తుందనే ఆసక్తి ఏర్పడింది. అయితే ఈ సినిమా వాళ్ళ ప్రేమ కథలను నమ్మలేం. ప్రేమికులందరూ పెళ్లి పందిరి వరకు వెళతారనే నమ్మకం ఉండదు. చిన్న చిన్న కారణాలతో బ్రేకప్ చెప్పుకుంటారు. హీరోయిన్ రష్మిక మందాన కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించి నిశ్చితార్థం చేసుకుంది. కొన్ని రోజుల్లో పెళ్లనగా ట్విస్ట్ ఇస్తూ… క్యాన్సిల్ చేసింది. రష్మిక కొట్టిన దెబ్బకు రక్షిత్ శెట్టి చాలా కాలం కోలుకోలేదు.