Manchu Manoj: మంచు మనోజ్ వివాహం ఘనంగా ముగిసింది. ఇష్ట సఖి భూమా మౌనిక మెడలో ఆయన తాళికట్టారు. వేద మంత్రాల మధ్య ఏడడుగులు వేశారు. మార్చి 3వ తేదీన మౌనిక-మనోజ్ ల వివాహం జరిగింది. మంచు లక్ష్మి నివాసంలో ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. సినీ రాజకీయ ప్రముఖులు మనోజ్ పెళ్లికి హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. మనోజ్ పెళ్ళికి అక్క మంచు లక్ష్మి అన్నీ తానై వ్యవహరించారు. పెళ్లి పెద్దగా వ్యవహరించారు. తమ్ముడి వివాహం అతిధులు, సన్నిహితులు అబ్బురపడేలా దగ్గరుండి పూర్తి చేశారు.
కాగా పెళ్లైన మరుసటి రోజే ఒక విషయం మీద మనోజ్ స్పష్టత ఇచ్చారు. భూమా మౌనిక కొడుకు బాధ్యత కూడా తనదే అని చెప్పకనే చెప్పాడు. ఆయన సోషల్ మీడియా పోస్ట్ అందరినీ ఆకర్షించింది. ఈ క్రమంలో మనోజ్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. భూమా మౌనిక 2016లో బెంగుళూరుకు చెందిన గణేష్ రెడ్డి అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి ధైరవ్ రెడ్డి అనే కొడుకు ఉన్నాడు. అతడు 2018లో పుట్టాడు. ఈ ఐదేళ్ల కొడుకు బాధ్యత మంచు మనోజ్ తీసుకోనున్నారు.

గణేష్ రెడ్డితో విడాకులైనప్పటి నుండి మౌనిక వద్దే కొడుకు ధైరవ్ రెడ్డి పెరుగుతున్నాడు. మౌనిక రెండో వివాహం చేసుకున్నప్పటికీ కొడుకు ఆమె వద్దే ఉంటారు. ఈ విషయంలో మౌనిక పెళ్లికి ముందే మనోజ్ వద్ద హామీ తీసుకున్నారట. ఇదే విషయాన్ని ఆయన ఫ్యాన్స్ అండ్ పబ్లిక్ కి తెలియజేశారు మనోజ్ ఇంస్టాగ్రామ్ లో తన చేతులతో మౌనిక చేతులు, ధైరవ్ రెడ్డి చేతులు పట్టుకున్న ఫోటో షేర్ చేశారు. కామెంట్ గా ‘శివాజ్ఞ’ అని పెట్టాడు. కాబట్టి ధైరవ్ మనోజ్ అడాప్టెడ్ సన్ అన్నమాట.
ఈ క్రమంలో మనోజ్ ని నెటిజెన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మీరు గ్రేట్, మౌనికతో పాటు ఆమె కుమారుడిని కూడా అంగీకరించారు. మీరు చాలా మందికి స్ఫూర్తి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మనోజ్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలం అవుతుంది. ఇటీవల ఆయన వాట్ ది ఫిష్ టైటిల్ తో ఒక మూవీ ప్రకటించారు. త్వరలో ఆయన రీఎంట్రీ ఇవ్వనున్నారు. మంచు మనోజ్ హీరోగా సక్సెస్ కాలేకపోయారు.