https://oktelugu.com/

Tollywood Film Producers Council elections: ముగిసిన టాలీవుడ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికలు… ఊహించని ఫలితాలు!

Tollywood Film Producers Council elections : ఫిబ్రవరి 19 ఆదివారం టాలీవుడ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ ఎన్నికలు ముగిశాయి. నిర్మాతలు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొన్నారు. పోలింగ్ అనంతరం ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించారు. ప్రెసిడెంట్ పదవి కోసం దామోదర ప్రసాద్, కె ఎల్, జెమినీ కిరణ్ పోటీపడ్డారు. అత్యధిక ఓట్లతో ప్రత్యర్థి జెమిని కిరణ్ పై దామోదర ప్రసాద్ గెలుపొందారు.దామోదర ప్రసాద్ కి 339 ఓట్లు పోల్ అయ్యాయి. ఆయన ప్రత్యర్థి జెమిని కిరణ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 19, 2023 5:34 pm
    Follow us on

    Tollywood Film Producers Council elections : ఫిబ్రవరి 19 ఆదివారం టాలీవుడ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ ఎన్నికలు ముగిశాయి. నిర్మాతలు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొన్నారు. పోలింగ్ అనంతరం ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించారు. ప్రెసిడెంట్ పదవి కోసం దామోదర ప్రసాద్, కె ఎల్, జెమినీ కిరణ్ పోటీపడ్డారు. అత్యధిక ఓట్లతో ప్రత్యర్థి జెమిని కిరణ్ పై దామోదర ప్రసాద్ గెలుపొందారు.దామోదర ప్రసాద్ కి 339 ఓట్లు పోల్ అయ్యాయి. ఆయన ప్రత్యర్థి జెమిని కిరణ్ కి 315 ఓట్లు పడ్డాయి. 24 ఓట్ల మెజారిటీతో దామోదర ప్రసాద్ విజయం సాధించారు.

    ఇక వైస్ ప్రెసిడెంట్ పదవికి సుప్రియ అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ట్రెజరర్ గా సత్యనారాయణ గెలుపొందారు. హానరబుల్ సెక్రెటరీ పదవికి నలుగురు పోటీపడ్డారు. వీరిలో ఇద్దరు ఎన్నికయ్యారు. ప్రసన్న కుమార్, వైవిఎస్ చౌదరి, మోహన్ గౌడ్, మోహన్ వడ్లపట్ల అభ్యర్థులుగా నిల్చున్నారు. 397 ఓట్లలో ప్రసన్న కుమార్, 380 ఓట్లతో మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. హానరబుల్ సెక్రెటరీ పదవికి వారిద్దరూ ఎంపికయ్యారు.

    కాగా జాయింట్ సెక్రెటరీ గా భారత్ చౌదరి 412తో గెలుపొందారు. తర్వాత 247 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.

    ఇక మెంబర్స్ గా…
    దిల్ రాజు(470 ఓట్లు)
    దానయ్య (421 ఓట్లు)
    రవి కిషోర్ (419 ఓట్లు)
    యలమంచిలి రవి (416 ఓట్లు)
    పద్మిని (413 ఓట్లు)
    బెక్కం వేణుగోపాల్ (406 ఓట్లు)
    సురేందర్ రెడ్డి (396 ఓట్లు)
    గోపీనాథ్ ఆచంట (353 ఓట్లు)
    మధుసూదన్ రెడ్డి (347 ఓట్లు)
    కేశవరావు (323)
    శ్రీనివాస్ వజ్జ (306 ఓట్లు)
    అభిషేక్ అగర్వాల్ 297
    కృష్ణ తోట (293 ఓట్లు)
    రామకృష్ణ గౌడ్ (286 ఓట్లు)
    కిషోర్ పూసలు (285 ఓట్లు)… ఎన్నికయ్యారు.

    తారకరత్న మరణం నేపథ్యంలో TFPC ఎన్నికలకు బ్రేక్ పడుతుందని అందరూ భావించారు. అయితే ఎలక్షన్స్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం నిర్వహించారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మాజీ ప్రెసిడెంట్ సి. కళ్యాణ్ నిన్న ప్రొడ్యూసర్స్ గిల్డ్, దిల్ రాజుని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రసన్న కుమార్ కి మద్దతు తెలిపారు. ఆయన హానరబుల్ సెక్రెటరీగా గెలుపొందారు.

    కొన్నాళ్లుగా ప్రొడ్యూసర్స్ గిల్డ్-ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. గత ఏడాది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ షూటింగ్స్ తాత్కాలింగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. అందుకు ప్రొడ్యూసర్స్ గిల్డ్ కారణమని సి. కళ్యాణ్ అభిప్రాయం. ఇక దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన వారసుడు విడుదల తేదీ విషయంలో కూడా వివాదం నెలకొంది. డబ్బింగ్ మూవీ వారసుడు సంక్రాంతికి విడుదల చేయకూడదంటూ కౌన్సిల్ నిర్ణయించింది. అది ఏ మేరకు అమలైందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎవరు గెలుస్తారనే ఆసక్తి నెలకొంది.