Sikkim: దేశంలో చాలామంది రైలు ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ఖర్చుతో సురక్షితంగా ప్రయాణించవచ్చని రైలు ప్రయాణానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దగ్గర అయిన, దూరం అయిన సమయం ఉంటే మొదటి ప్రాధాన్యత రైలు ప్రయాణానికే ఇస్తారు. అయితే దేశంలో ఎన్నో రకాలు రైళ్లు ఉన్నాయి. పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఎవరి బడ్జెట్‌కు తగ్గట్లుగా రైలు ప్రయాణాల్లో సౌకర్యాలు ఉంటాయి. కనీసం నెలకి ఒకసారైన ప్రతి ఒక్కరూ ఏదో పని మీద బయటకు వెళ్తుంటారు. ఈరోజుల్లో చాలామంది తరచుగా బయట ట్రిప్‌లకు వెళ్తుంటారు. దీంతో టైన్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే బస్సు అయితే లేటు అవుతుంది. పోని ఫ్లైట్‌కి అయితే తొందరగా వెళ్లవచ్చు. కానీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. తక్కువ ఖర్చులో అన్ని చుట్టేసి రావాలని ఎక్కువ శాతం మంది రైలు ప్రయాణం చేయడానికే ఇష్టపడుతుంటారు. అయితే ఇండియాలో ఏ ప్రాంతానికి వెళ్లడానికి అయిన కూడా రైల్వే సౌకర్యం ఉంటుంది. ఈ క్రమంలో ప్రదేశాన్ని బట్టి వాటికి దగ్గరగా రైల్వే స్టేషన్లు ఉంటాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లు ఉంటాయి. కానీ దేశంలో ఒకే ఒక్క రాష్ట్రంలో మాత్రం రైల్వే స్టేషన్ లేదు. ఇంతకీ ఏ రాష్ట్రంలో రైల్వే స్టేషన్‌లో లేదు. అసలు ఎందుకు లేదో ఈ స్టోరీలో చూద్దాం.
బ్రిటీష్ వారు ఉన్నప్పుడు రైల్వే లైన్‌ను మొదట ప్రారంభించారు. తర్వాత కాలను క్రమంగా దేశ వ్యాప్తంగా రైల్వే లైన్‌ను నిర్మించారు. అయితే మన దేశంలో ఇప్పటీకీ సిక్కిం రాష్ట్రంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు. మేఘాలయలో కూడా రైల్వే స్టేషన్ ఉండేది కాదు. కానీ ఈ మధ్య కాలంలోనే రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. సిక్కింలో కూడా రైల్వే స్టేషన్‌ను ప్రారంభించాలని చూస్తున్నారు. సిక్కింలో టూరిస్ట్ ప్లేస్‌లు చాలానే ఉన్నాయి. ఇక్కడి ప్రకృతి చూడటానికి స్వర్గంలా ఉంటుంది. ప్రతీ ఏడాది ఎంతో మంది సిక్కిం రాష్ట్రం సందర్శించడానికి వెళ్తుంటారు. కానీ ఇక్కడ రైల్వే స్టేషన్ లేదు. అయితే ఇంత ఎక్కువగా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. వీటిని చూడటానికి ఎక్కువ మంది వెళ్తుంటారు. కానీ ఇప్పటికీ రైల్వే లైన్ ఎందుకు ప్రారంభించలేదనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది.
సిక్కింలో ఎక్కువగా కొండలు, పర్వతాలు ఉంటాయి. కొన్ని సార్లు వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతుంటాయి. అలాగే భూకంపం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు ఇక్కడ రైల్వే లైన్‌ను ప్రారంభించలేదు. త్వరలో ఇక్కడ రైల్వే లైన్ ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న సిక్కింలో రైల్వే స్టేషన్ ప్రారంభానికి ప్రధాని మోదీ శంకు స్థాపన కూడా చేశారు. ఈ రైలు పనులు పూర్తయితే వచ్చే ఏడాదికి రైల్వే స్టేషన్ రెడీ అవుతున్నట్లే. సిక్కింలో ఉండే లోయల వల్ల అక్కడి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇన్ని రోజులు రైల్వే లైన్‌ను నిర్మించలేదు. ఇక రైల్వే స్టేషన్ ప్రారంభం అయితే దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా రైల్వే స్టేషన్ ఉన్నట్లే.