
Vennela Kishore- Kamal Haasan: మన టాలీవుడ్ లో ముఖం చూస్తేనే నవ్వొచ్చే కమెడియన్స్ ఎంతోమంది ఉన్నారు.కానీ రీసెంట్ గా కొంతమంది కమెడియన్స్ నవ్వించడం మానేసి భయపెట్టడం ప్రారంభించారు.ఒకప్పుడు తన కామెడీ టైమింగ్ తో లెజెండ్స్ ని సైతం డామినేట్ చేసి ప్రేక్షకులతో కడుపుబ్బా నవ్వించే సునీల్, ఆ తర్వాత హీరో గా మారి, ఇప్పుడు వరుసగా విలన్ క్యారెక్టర్స్ చేస్తూ జనాలను భయపెట్టేస్తున్నాడు.ఇప్పుడు రీసెంట్ గా అదే దారిలో ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా నడవబోతున్నాడా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.
తన డిఫరెంట్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల పొట్టలు చెక్కలయ్యేలా చేసే వెన్నెల కిషోర్ సౌత్ ఇండియన్ సినేషనల్ డైరెక్టర్ శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఇండియన్ 2 ‘ చిత్రం లో విలన్ గా బయపెట్టబోతున్నాడు.ఇటీవలే ఆయన షూటింగ్ సెట్స్ లోకి కూడా అడుగుపెట్టాడట.ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
కమెడియన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ టైం లోనే స్టార్ కమెడియన్ గా ఎదిగిన వెన్నెల కిషోర్ ఇప్పటి వరకు నెగటివ్ రోల్స్ లో నటించాడు.అడవి శేష్ హీరో గా నటించిన ‘గూఢచారి’ చిత్రం లో నెగటివ్ రోల్ చేసాడు కానీ, అది పూర్తి స్థాయిలో మాత్రం కాదు.సినిమా మొత్తం పాజిటివ్ గా ఉంటూ చివర్లో ట్విస్ట్ లాగ తన నెగటివ్ క్యారక్టర్ ని బయటపెడుతాడు.కానీ ఇండియన్ 2 మాత్రం పూర్తి స్థాయి నెగటివ్ రోల్ చేస్తున్నాడట.డైరెక్టర్ శంకర్ సినిమాలో నెగటివ్ రోల్ అంటే మామూలు విషయం కాదు, ఎందుకంటే ఆయన సినిమాలో విలన్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటారు.

హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా విలన్ పాత్రలను రాసుకుంటాడు శంకర్.ఈ సినిమాలో కూడా వెన్నెల కిషోర్ కి అలాంటి పాత్రనే రాసుకున్నాడట.మరి కామెడీ తో అశేష ప్రేక్షాదరణ పొందిన వెన్నెల కిషోర్, ఇప్పుడు తన విలనిజం తో అదే రేంజ్ ఆదరణ దక్కించుంటాడా లేదా అనేది చూడాలి.