
Waltair Veerayya OTT: మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే.ఆచార్య మరియు గాడ్ ఫాదర్ వంటి డిజాస్టర్స్ తర్వాత మెగాస్టార్ ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ కొట్టి కంబ్యాక్ ఇస్తాడని మెగా ఫ్యాన్స్ కూడా ఊహించలేకపోయారు.సుమారుగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించి ఆల్ టైం టాప్ 5 మూవీస్ లో ఒకటిగా నిల్చిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది.
ఈమధ్య కలం లో అత్యధిక సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకున్న ఏకైక చిత్రం గా సరికొత్త రికార్డుని నెలకొల్పింది.అయితే ఈ సినిమా ఇంకా థియేటర్స్ రన్నింగ్ అవుతుండగానే ఓటీటీ లో విడుదల చేసేసారు.నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రాన్ని సోమవారం రోజు విడుదల చెయ్యగా మిశ్రమ స్పందన లభించినట్టు తెలుస్తుంది.
థియేటర్స్ లో హిట్ అయ్యినట్టుగానే ఓటీటీ లో కూడా ఈ సినిమాకి బంపర్ రెస్పాన్స్ వస్తుందని అనుకున్నారు.కానీ సరైన టైమింగ్ లో విడుదల చెయ్యకపోవడం వల్ల ఆశించినంత వ్యూస్ రాబట్టలేకపోయింది.మరో ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏమిటంటే, ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ లిస్ట్ లోకి రావడానికి రెండు రోజుల సమయం పట్టింది.మెగాస్టార్ గత చిత్రం ‘గాడ్ ఫాదర్’ కి నెట్ ఫ్లిక్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.సుమారుగా ఆరు వారాల పాటు నాన్ స్టాప్ గా ట్రెండ్ అయ్యి, #RRR తర్వాత అత్యధిక రోజులు ట్రెండ్ అయినా చిత్రం గా అరుదైన రికార్డు ని నెలకొల్పింది.కానీ ‘వాల్తేరు వీరయ్య’ కి మాత్రం ఆ రేంజ్ రెస్పాన్స్ రాలేదు.

అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాకి రెండు రోజులకు కలిపి కేవలం రెండు మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయట.వీకెండ్ మొత్తం వదిలేసి సోమవారం రోజు విడుదల చెయ్యడం వల్లే ఇంత తక్కువ వ్యూస్ వచ్చాయని అంటున్నారు విశ్లేషకులు.ఓటీటీ ఓపెనింగ్స్ లో ఆశించిన స్థాయి రెస్పాన్స్ ని దక్కించుకోలేకపోయిన ఈ చిత్రం లాంగ్ రన్ లో అయినా రికార్డ్స్ ని నెలకొల్పుతుందో లేదో చూడాలి.