
Mahesh – Rajamouli Movie Teaser: సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలోనే దర్శక ధీరుడు రాజమౌళి తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.ఎప్పుడో పదేళ్ల క్రితమే ఖరారైన ఈ క్రేజీ ప్రాజెక్ట్, మహేష్ మరియు రాజమౌళి కి ఉన్న కమిట్మెంట్స్ వల్ల వాయిదా పడుతూ ఎట్టకేలకు కార్యరూపం దాల్చబోతుంది.అప్పట్లో మహేష్ – రాజమౌళి సినిమా వచ్చి ఉంటే కేవలం పాన్ ఇండియా లెవెల్ లో మాత్రమే సినిమా తెరకెక్కి ఉండేది.కానీ ఇప్పుడు రాజమౌళి రేంజ్ పాన్ ఇండియా రేంజ్ దాటి పాన్ వరల్డ్ కి వెళ్ళిపోయింది.
మరికొద్ది రోజుల్లో ఆయన తెరకెక్కించిన #RRR చిత్రం లోని ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అవార్డు కూడా దక్కబోతోంది.ఇంత రేంజ్ పెరిగిన తర్వాత మహేష్ తో సినిమా చెయ్యడం, ఫ్యాన్స్ చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి.ఇప్పటికే మహేష్ తో తియ్యబోయ్యే సినిమా కోసం వెయ్యి కోట్ల రూపాయిల బడ్జెట్ పెట్టబోతున్నట్టు సమాచారం.పాన్ వరల్డ్ రేంజ్ లో 30 భాషల్లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారట.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.అదేమిటి అంటే ఈ సినిమాకి సంబంధించిన చిన్న గ్లిమ్స్ వీడియో ని ఉగాది కానుకగా విడుదల చేయబోతున్నారట.#RRR సినిమా తర్వాత రాజమౌళి తన సినిమా లుక్స్ కోసం మహేష్ ని కొన్ని యాంగిల్స్ కవర్ చేస్తూ లుక్ టెస్ట్ కోసం ఒక వీడియో తీసారట.సినిమా కాన్సెప్ట్ ని వివరించేలా ఉండబోతున్న ఈ గ్లిమ్స్ ఫ్యాన్స్ కి పూనకాలు రప్పించే రేంజ్ లో ఉంటుందని టాక్.సినిమా ప్రారంభం కి ముందే తన సినిమా కాన్సెప్ట్ గురించి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పే అలవాటు ఉన్న రాజమౌళి, ఈసారి కూడా ఉగాది రోజున అదే చేయబోతున్నాడట.

ఇందుకోసం ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చెయ్యబోతునట్టు సమాచారం.దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే చేయబోతున్నారట.#RRR సినిమా తో పాన్ వరల్డ్ మార్కెట్ కి ద్వారాలు తెరిచిన రాజమౌళి, మహేష్ సినిమాతో హాలీవుడ్ సినిమాలతో పోటీపడిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.
