AIDS Day 2022: 1980లో వెలుగు చూసిన ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్. మొదట దీని గురించి అవగాహన లేక చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజల్లో చైతన్యం పెరిగాక వ్యాధి తీవ్రత తగ్గింది. ఎయిడ్స్ వ్యాధి సోకితే పన్నెండేళ్ల పాటు జీవించగలుగుతారు. తరువాత మరణమే. దీంతో వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎయిడ్స్ వ్యాధి వెలుగు చూసిన తరువాత నాలుగేళ్లకు డిసెంబర్ 1ని ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దీని బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇది దక్షిణాఫ్రికాలో వెలుగు చూసింది. ఒక చింపాంజీ నుంచి మనిషికి సోకినట్లు గుర్తించారు. కరోనా లాంటి వైరస్ కు ఏడాదిలోనే మందు కనిపెట్టినా దీనికి మాత్రం నలభై ఏళ్లు దాటినా మందు మాత్రం కనిపెట్టలేకపోయారు. హ్యూమన్ ఇమ్యునో డెఫిసియన్సీ వైరస్ (హెచ్ఐవీ) సోకడానికి నాలుగు ప్రధాన కారణాలు ఉంటాయి. లైంగిక సంబంధాలు, రక్తం ఎక్కించుకోవడం, ఒకరికి వాడిన సూదులు మరొకరికి వాడటం, తల్లికి సోకితే ఆమె ద్వారా బిడ్డలకు ఇలా నాలుగు రకాలుగా హెచ్ఐవీ వ్యాపిస్తుంది.
అప్పట్లో వ్యాధికి అందర భయపడ్డారు. మానవాళి మనుగడకే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందారు. మహమ్మారి ధాటికి అందరు వణికిపోయారు. కానీ తొందరగానే అది మనుషుల నుంచి దూరంగా వెళ్లింది. ఎయిడ్స్ కు మందు లేదు నివారణ ఒకటే మార్గమని ప్రచారం చేయడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. ఎయిడ్స్ సోకితే రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా ఇమ్యూనిటీ తగ్గుతుంది. డాక్టర్ల సలహాలు, సూచనలతో మామూలుగా జీవించొచ్చని చెబుతున్నారు.

ఎయిడ్స్ తో ఏటా 15 లక్షల మది మందులు వాడుతున్నారు. ఇంతవరకు 3.5 కోట్ల మందికి పైగా చనిపోయారు. దక్షిణాఫ్రికాలో 77 లక్షల మందికి పైగా వైరస్ సోకింది. 71 వేల మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచ దేశాలు అక్కడ చైతన్యం కలిగించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నా వ్యాధి తీవ్రత తగ్గడం లేదు. ఎయిడ్స్ ను పూర్తిగా తరిమేయాలంటే నివారణ ఒక్కటే మార్గం. ప్రజలు చైతన్యవంతులైతేనే ఇది సాధ్యమవుతుంది. అంతేకాని మనం ఎంత చెప్పినా వినకపోతే అంతే సంగతి. సురక్షిత లైంగిక సంబంధాలు కొనసాగిస్తేనే ఎయిడ్స్ నుంచి బయట పడొచ్చు.