https://oktelugu.com/

Dhanush ‘SIR’ : ధనుష్ కి టాలీవుడ్ లో ఇంత క్రేజ్ ఉందా.. హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్న ‘సార్’ ప్రీమియర్ షోస్ టికెట్స్

Dhanush ‘SIR’ తమిళ స్టార్ హీరో ధనుష్ మొట్టమొదటి తెలుగు సినిమా ‘సార్’ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతుంది. ఇది వరకు తమిళం, హిందీ మరియు ఇంగ్లీష్ మూవీస్ లో డైరెక్ట్ సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్న ధనుష్ తెలుగు లో మాత్రం ఇన్ని రోజులు మూవీ చెయ్యలేదు. ఆయన తమిళం లో హీరోగా నటించిన సినిమాలు ఇక్కడ డబ్ చేసారు కానీ, డైరెక్ట్ గా తెలుగు సినిమా చెయ్యడం ఇదే తొలిసారి. అయితే ఈ సినిమా […]

Written By:
  • NARESH
  • , Updated On : February 16, 2023 / 09:13 PM IST
    Follow us on

    Dhanush ‘SIR’ తమిళ స్టార్ హీరో ధనుష్ మొట్టమొదటి తెలుగు సినిమా ‘సార్’ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతుంది. ఇది వరకు తమిళం, హిందీ మరియు ఇంగ్లీష్ మూవీస్ లో డైరెక్ట్ సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్న ధనుష్ తెలుగు లో మాత్రం ఇన్ని రోజులు మూవీ చెయ్యలేదు. ఆయన తమిళం లో హీరోగా నటించిన సినిమాలు ఇక్కడ డబ్ చేసారు కానీ, డైరెక్ట్ గా తెలుగు సినిమా చెయ్యడం ఇదే తొలిసారి.

    అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని నిన్న హైదరాబాద్ లో ఘానంగా చేసారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీ యూనిట్ మొత్తం ఈ సినిమా మీద ఎంతో నమ్మకం తో మాట్లాడిన మాటలను చూస్తే కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలిగింది.టీజర్ మరియు ట్రైలర్ చూసినప్పుడు కూడా ఇలాంటి అనుభూతి కలుగలేదనే చెప్పొచ్చు.ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా 35 షోస్ కి పైగా వేశారు.

    ఈ 35 షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్ లో జరిగాయి.తెలుగు హీరో సినిమాకి ఎలాంటి బుకింగ్స్ ఉంటాయని ఆశిస్తామో అలాంటి బుకింగ్స్ ఈ చిత్రానికి జరిగాయి. ఇది చూసి టాలీవుడ్ ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెట్టారు.. కేవలం ఈ ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రానికి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంచనా వేస్తున్నారు.. ప్రీమియర్స్ నుండి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇక రేపు రెగ్యులర్ షోస్ నుండి కూడా పాజిటివ్ టాక్ వచ్చేస్తే ధనుష్ కి టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ దక్కినట్టే. చూడాలిమరి తెలుగు ఆడియన్స్ ధనుష్ ని ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది.. ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా, జీవి ప్రకాష్ సంగీతం అందించాడు. భీమ్లా నాయక్ సినిమా తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని కూడా నిర్మించింది.